Gold prices: బంగారం ధరలు పతనం.. వినియోగదారులకు గోల్డెన్ ఛాన్స్!

ఉత్తర భారతదేశంలో ఈ రోజు కర్వా చౌత్ పండుగను ఎంతో భక్తి, ఆనందాలతో జరుపుకుంటున్నారు. వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఉపవాసం ఉండే ఈ పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. తెల్లవారుజాము నుంచీ చంద్రుడు కనిపించే వరకు ఆహారం, నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండి భర్తల క్షేమం కోసం ప్రార్థిస్తారు. ఈ రోజు భార్యాభర్తల మధ్య ప్రేమ, విశ్వాసం, బంధం మరింత బలపడే రోజు అని నమ్మకం.

రిషికొండ ప్యాలెస్ వినియోగంపై మంత్రివర్గం కీలక చర్చలు... త్వరలో ప్రకటనలు ఇవ్వనున్న ప్రభుత్వం!!

పురాణాల ప్రకారం‌కర్వా చౌత్ పండుగకు రెండు ప్రసిద్ధ కథలు ఉన్నాయి. ఒకటి సావిత్రి సత్యవంతుడి కథ. ఆమె తన భర్తను యముడి నుండి రక్షించడానికి కఠినమైన ఉపవాసం చేసి ప్రార్థించిందని చెబుతారు. మరో కథ ప్రకారం ఒక బ్రాహ్మణుడి కుమార్తె వీరావతి తన భర్త మరణం తర్వాత కర్వా చౌత్‌ ఉపవాసం చేసి అతన్ని తిరిగి పొందిందని చెబుతారు. ఈ కథలు మహిళల భక్తి, ప్రేమ, త్యాగాన్ని తెలియజేస్తాయి.

Nobel Prize : నా వల్లే యుద్ధాలు ఆగాయి.. ట్రంప్ కు ఈ ఏడాది నోబెల్ రానట్టే.. కారణమిదే!

ఈ రోజు మహిళలు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి, ఆభరణాలతో అలంకరించుకుంటారు. 

అల్లు అర్జున్ మార్కెట్ ఆ స్థాయిలో లేకపోవడంతో..ప్రమాదమని భావించినా అల్లు అరవింద్!!

అత్తగారు ఇచ్చే సర్గి అనే ఆహారం తీసుకున్న తర్వాత ఉపవాసం ప్రారంభిస్తారు. 

బరువు తగ్గాలంటే రోజూ ఉదయం ఇదే బెస్ట్.. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండే మ్యాజిక్ ఫుడ్!

రోజు మొత్తం ఆహారం నీరు లేకుండా దేవుడి పూజలు చేస్తారు. సాయంత్రం సమయంలో ఇతర మహిళలతో కలిసి పూజలు నిర్వహించి కర్వా అనే మట్టి కుండతో ప్రత్యేక పూజ చేస్తారు.

NTR Bhrosa: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తనిఖీ ప్రారంభం! లబ్ధిదారులకు కీలక సమాచారం!

చంద్రుడు కనిపించిన తర్వాత మహిళలు చంద్రుణ్ణి చూసి  తరువాత తమ భర్త ముఖాన్ని చూసి ప్రార్థిస్తారు. భర్తల దీర్ఘాయుష్షు ఆరోగ్యం కోసం దేవుని ఆశీర్వాదం కోరుకుంటారు. ఆ తర్వాత భర్త చేత నీరు తాగి  ఉపవాసం ముగిస్తారు. ఈ పండుగలోని సంప్రదాయాలు‌ భావాలు భార్యాభర్తల మధ్య ప్రేమను మరింత బలపరుస్తాయి.

అతిపెద్ద పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ నోటిఫికేషన్..ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!!

ఇలా కర్వా చౌత్ పండుగ భక్తి ప్రేమ విశ్వాసం కలయికగా నిలుస్తుంది. మహిళలు భర్తల క్షేమం కోసం చేసే ఈ త్యాగం వారి ఆత్మవిశ్వాసం భక్తిని ప్రతిబింబిస్తుంది. కాలం మారుతున్నా ఈ పండుగ భావం మాత్రం మారడం లేదు. భక్తి, ప్రేమ కుటుంబ బంధానికి ప్రతీకగా కర్వా చౌత్ పండుగ ప్రతి సంవత్సరం అదే ఉత్సాహంతో కొనసాగుతోంది.

Fire Accident: ఏపీలో ఘోర అగ్నిప్రమాదం! రూ.500 కోట్ల ఆస్తి నష్టం!

కర్వా చౌత్ ఉత్తర భారతదేశంలో వరలక్ష్మి వ్రత దక్షిణంలో జరుపుకుంటారు ఇరువురిలోనూ భర్తల దీర్ఘాయుష్షు, శ్రేయస్సు కోసం భార్యలు భక్తితో ఉపవాసం చేసి, పూజలు చేస్తారు, కానీ పద్ధతులు, ప్రాంతం మాత్రమే భిన్నం.

మోదీ సర్కార్ తీపికబురు.. 21వ విడత పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఈ 4 రాష్ట్రాల రైతులకు తక్షణ సాయం!
ఎట్టకేలకు శుభవార్త.. బ్లాక్‌బస్టర్ 'మిరాయ్' ఓటీటీలోకి ఎంట్రీ.! తెలుగుతో పాటు పలు భాషల్లో..