కార్తీక్ ఇంటికి వచ్చిన తర్వాత సామాన్లు చూసి ఎవరు తీసుకువచ్చారు అని అడుగుతాడు, శ్రీధర్ నేనే తీసుకొచ్చాను అని అంటాడు. అప్పుడు కార్తీక్ మాకు ఇవి వద్దు అని చెప్పేసి కారులో పెడదాం రా పెద్దమ్మ అని సహాయం కోరుతాడు, ఇంతలో శ్రీధర్ మేము ఇంటికి వచ్చి మీ ఇంట్లో అందరితోపాటు భోజనం చేస్తున్నాం, నా భార్య నా అల్లుడు వచ్చి తింటున్నాం మీరు అయితే మా కోసం ఏమైనా చేయవచ్చు, మేము మాత్రం మీకోసం ఏమి చేయకూడదు, నువ్వు ఇవి కారులో పెడితే నేను ఇంకెప్పుడు మీ ఇంటికి రాను అని అంటాడు.
ఒక తండ్రిగా నేను బాధపడతాను ఇటు నీ జీవితం ఇలా అయిపోయింది నా కూతురు జీవితం కూడా అలా అయిపోతుంది అని అంటాడు. నా పిల్లల కోసం ఏమి చేయలేకపోతున్నానని కుమిలి కుమిలి ఏడుస్తున్నాను నువ్వు తాత ఇంటిలో డ్రైవర్‌గా పని చేయడం నాకు ఇష్టం లేదు కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటాడు. అల్లుడు ఏం చేస్తున్నాడు అంటే సమాధానం లేదు కొడుకు చేస్తున్నాడు చెప్పుకోడానికి సమాధానం ఉంది కానీ ధైర్యం లేదు ఎందుకంటే ఏ కోటీశ్వరుడు నా కొడుకు డ్రైవర్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవ్వడ్రా అని అంటాడు.
ఆ తర్వాత దీపకి ఎలా ఉంది అని కార్తీక్‌ని అడుగుతాడు కార్తీక్ దీప బాగానే ఉందండి అని సమాధానం ఇస్తాడు, రాత్రి తినకుండా పడుకుంది తిను అని చెప్పినా వినలేదు అని అనసూయ అంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది ఇప్పుడు బాగానే ఉంది అని కార్తీక్ అంటాడు. భోజనం తిన్నావా అని అడుగుతారు సుమిత్ర అత్త పెట్టింది అని కార్తీక్ సమాధానం ఇస్తాడు.
జోష్నా పారిజాతం కిందకు వచ్చి భోజనం చేద్దాం అమ్మ అని అడుగుతుంది సుమిత్ర మీరు తినండి అని చెప్తుంది. అంతలో పారు మీ నాన్న భోజనం చేయకుండా మీ అమ్మ భోజనం తినదు అని చెప్తుంది. అప్పుడు జోష్న వెళ్లి నాన్నను పిలుస్తుంది, దశరథ మీరు తినండి నేను తర్వాత తింటాను అని అంటాడు. జోష్న నేను అమ్మ గురించి మాత్రమే పట్టించుకుంటాను మీరు అమ్మ గురించి పట్టించుకోవాలి కదా నాన్న అని అంటుంది, అప్పుడు దశరథ నువ్వు ఏం మాట్లాడద్దు ఇక్కడ నుండి వెళ్ళు జోష్న అని అంటాడు. మీకు అమ్మ గురించి నిజం తెలియాలి అమ్మ దీపకు నీరసంగా ఉంటే కూర్చోపెట్టి సేవలు చేసింది అని జోష్న చెబుతుంది. దీప కోసం మీరు అమ్మని దూరం పెడుతున్నారు అమ్మతో మాట్లాడడం లేదు అని జోష్న అంటుంది. అప్పుడు దశరథ నేను మాట్లాడను అని అంటాడు అంతలో శివనారాయణ జోష్నను తిడతాడు.ఎందుకు నువ్వు అమ్మ నాన్న దూరం పెంచుతున్నావు వాళ్లిద్దరికీ తెలియదా మాట్లాడుకోవాలి లేదో భార్యాభర్తలు ఎంతకాలం మాట్లాడకుండా ఉంటారు అని చెప్పి పాద దశరథ భోజనం చేద్దాం అని అంటాడు.
ఉదయం శ్రీధర్ శివనారాయణ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత నా కొడుకుతో అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేయించాలి అని అడుగుతాడు అప్పుడు జోష్న 10 కోట్లు కట్టాలి అని చెబుతుంది. శ్రీధర్ 10 కోట్లు నేను కడతా అని చెప్పి చెక్‌బుక్‌పై సంతకం చేసి జోష్నాకు ఇస్తాడు.అప్పుడు జోష్న మావయ్య నువ్వు ఇస్తావు నాకు ఓకే కానీ బావ చేతుల మీదుగా ఇస్తేనే నేను తీసుకుంటాను ఎందుకంటే బావ నాకు అగ్రిమెంట్ రాసింది అని చెబుతుంది.
అప్పుడే కార్తీక్ దీప ఇంట్లోకి అడుగుపెడతాడు పారిజాతం అందరిని వీడి కంట్రోల్ పెట్టుకుంటాడు అందరిని మార్చేసుకుంటాడు అని అంటుంది. అప్పుడు కార్తీక్ నాన్న నాకు ఎందుకు ఇక్కడికి వచ్చాడో కూడా తెలియదు అని సమాధానం ఇస్తాడు. పారు వీడికి అన్ని అవకాశాలు వస్తాయి అని అంటుంది, అప్పుడు దశరథ పిన్ని ఆగండి ఎందుకలా మాట్లాడుతున్నారు అని అంటాడు. కార్తీక్ ఇప్పుడే కాదు అంతకుముందు కూడా చాలా అవకాశాలు వచ్చాయి కానీ అప్పుడు కూడా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయలేదు అని అంటాడు దశరథ.
అప్పుడు జోష్నా మావయ్య వచ్చారు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించడానికి అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఏంటి మాస్టారు ఇది అని అంటాడు అగ్రిమెంట్ గురించి నువ్వు ఎందుకు అడిగావు అని శ్రీధర్‌ని కార్తీక్ అడుగుతాడు. అప్పుడు దశరథ కార్తీక్ ఏం మాట్లాడుకుంటారో పక్కన పెడదాం ఎందుకంటే ఆయన నీ తండ్రి నువ్వు తన కొడుకువి అని అంటాడు. మీ నాన్న నాన్న నిన్ను అగ్రిమెంట్ నుండి తీయడానికి జోష్నాకు 10 కోట్లు ఇచ్చాడు అని దశరథ చెబుతాడు, అంతలో శ్రీధర్ నేను చెప్పిన మాటకి కట్టుబడి ఉండాల్సిందే ఇదే జడ్జిమెంట్ డే అని అంటాడుఅక్కడితో సీరియల్ రేపటి భాగానికి తెరపడుతుంది.