టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఐటీ రంగంలో భారీ మార్పులు తీసుకువస్తోంది. ఆటోమేషన్ వల్ల కొన్ని సాంప్రదాయ ఉద్యోగాలు తగ్గే ప్రమాదం ఉన్నప్పటికీ, కొన్ని కీలకమైన రోల్స్ మాత్రం ఏఐతో రీప్లేస్ చేయడం అసాధ్యం. ఎందుకంటే ఆ ఉద్యోగాలు క్రియేటివిటీ, మానవ మేధస్సు, డెసిషన్ మేకింగ్ వంటి మానవునికి మాత్రమే సాధ్యమయ్యే నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి. కోడింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డేటా విశ్లేషణ వంటి విభాగాల్లో మానవుల ప్రాధాన్యత ఎప్పటికీ కొనసాగుతుంది.
ముందుగా సాఫ్ట్‌వేర్ డెవలపర్లు గురించి చెప్పుకోవాలి. కొత్త టెక్నాలజీలు రావాలంటే వాటిని డిజైన్ చేసి కోడ్ రాయగల మానవులే అవసరం. డీబగ్గింగ్, టెస్టింగ్, మెరుగైన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఇవ్వడం ఏఐ చేయలేని పనులు. అలాగే డేటా సైంటిస్టులు కూడా భవిష్యత్తులో మరింత డిమాండ్‌లో ఉంటారు. రోజువారీగా ఉత్పత్తి అయ్యే భారీ డేటాను విశ్లేషించి సరైన రీతిలో ప్రాసెస్ చేయగలిగేది మానవ మేధస్సే. అంతేకాదు, ఏఐ సిస్టమ్స్‌ను మరింత అభివృద్ధి చేయాలంటే డేటా సైంటిస్టులే కీ రోల్ పోషిస్తారు.
ఇక సైబర్ సెక్యూరిటీ రంగం విషయానికి వస్తే, ఇది పూర్తిగా మానవ నియంత్రణలోనే ఉండాలి. ఎందుకంటే కీలకమైన డేటా సెక్యూరిటీని ఏఐకు వదిలేయడం ప్రమాదకరం. కొత్త రకాల మాల్వేర్‌లు, హ్యాకింగ్ స్ట్రాటెజీలను ఎదుర్కోవడానికి మానవుల మేధస్సు తప్పనిసరి. అలాగే డిజైనర్లు కూడా ఏఐ రీప్లేస్ చేయలేని విభాగం. వెబ్‌పేజీలను డిజైన్ చేయడం లేదా ప్రొడక్ట్ లుక్‌ను డెవలప్ చేయడం ఏఐ చేయగలిగినా, కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను అర్థం చేసుకోవడం, క్రియేటివిటీతో యూనిక్ అనుభవం ఇవ్వడం మాత్రం మనిషి చేతిలోనే ఉంటుంది.
అదేవిధంగా ప్రాజెక్ట్ మేనేజర్లు, టీమ్ లీడర్లు వంటి రోల్స్‌కు ఏఐతో ఎలాంటి ముప్పు లేదు. ప్రాజెక్ట్ ప్లానింగ్, పనిని విభజించడం, టీం కోఆర్డినేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి బాధ్యతలను మానవులు మాత్రమే సమర్థంగా నిర్వహించగలరు. దీనితో పాటు ఏఐ ఎథిసిస్టులు, ఏఐ రీసెర్చర్లు, మిషన్ లెర్నింగ్ నిపుణులు, ప్రాంప్ట్ ఇంజనీర్స్ వంటి కొత్త రోల్స్ భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పొందనున్నాయి. మొత్తంగా చెప్పాలంటే, ఆటోమేషన్ పెరిగినా, మానవ మేధస్సు అవసరమయ్యే ఉద్యోగాలకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదు.