యాపిల్ ఈ వారం తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. భారతదేశంలో ప్రీ-బుకింగ్స్‌ను సెప్టెంబర్ 12 (శుక్రవారం) సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభించింది. కస్టమర్లు యాపిల్ అధికారిక ఆన్లైన్ స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా బుకింగ్స్ చేసుకోవచ్చు. కొత్త ఫోన్ల అమ్మకాలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం అవుతాయి. ఆ రోజు నుంచే ఆన్‌లైన్ ఆర్డర్ చేసిన వారికి హోమ్ డెలివరీ లేదా సమీపంలోని యాపిల్ స్టోర్‌లో స్వయంగా ఫోన్‌ను తీసుకునే అవకాశం ఉంటుంది.
ఐఫోన్ 17 బుక్ చేసుకోవడం చాలా సులభం. ముందుగా యాపిల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి హోమ్‌పేజీ నుంచి మీకు కావలసిన ఐఫోన్ 17 మోడల్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత వేరియంట్, కలర్, స్టోరేజ్ ఎంపిక చేసుకోవాలి. ఎంపిక పూర్తయిన తర్వాత “కార్ట్”లో జోడించి, చెక్అవుట్ బటన్‌పై క్లిక్ చేయాలి. బుకింగ్ కోసం కార్డ్, యూపీఐ లేదా ఈఎంఐ ఆప్షన్‌లలో ఏదైనా ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు. లావాదేవీ పూర్తయిన తర్వాత, కంపెనీ డెలివరీ సమయాన్ని కస్టమర్‌కి షేర్ చేస్తుంది.
ధరల విషయానికి వస్తే, ఐఫోన్ 17 బేస్ మోడల్ 256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.82,900గా నిర్ణయించారు. అదే 512GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.1,02,900. ఇవి సాధారణ వేరియంట్లకు చెందిన ధరలు. ఎక్కువ స్టోరేజ్ లేదా హై-ఎండ్ ఫీచర్లను కోరుకునే వారికి ప్రో మరియు ప్రో మాక్స్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ 17 ప్రో మోడల్ ధరలు 256GB వెర్షన్‌కు రూ.1,34,900 నుంచి మొదలై, 512GB వెర్షన్‌కు రూ.1,54,900, 1TB వెర్షన్‌కు రూ.1,74,900 వరకు ఉంటాయి. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరలు ఇంకా ఎక్కువ. 256GB వెర్షన్ ధర రూ.1,49,900 కాగా, 512GB వెర్షన్ రూ.1,69,900, 1TB వెర్షన్ రూ.1,89,900, 2TB వెర్షన్ రూ.2,29,900గా నిర్ణయించారు.
అదనంగా యాపిల్ ఈసారి ఐఫోన్ 17 ఎయిర్ మోడల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని 256GB వెర్షన్ ధర రూ.1,19,900, 512GB వెర్షన్ ధర రూ.1,39,900గా ఉంది. 1TB స్టోరేజ్ కలిగిన ఎయిర్ వెర్షన్ ధర రూ.1,59,900. ఈ విధంగా వినియోగదారులు తమ అవసరాలు, బడ్జెట్‌కి తగ్గట్టు విభిన్న మోడల్స్ మరియు స్టోరేజ్ ఆప్షన్స్ నుండి ఎంపిక చేసుకోవచ్చు.