తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్గా ఏపీ ట్రాన్స్కో సంయుక్త ఎండీ కీర్తి చేకూరి నియమితులయ్యారు. ఆమె గతంలో ఉమ్మడి జిల్లా సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి)గా విధులు నిర్వర్తించారు. మదనపల్లి సబ్కలెక్టర్, గుంటూరు మున్సిపల్ కమిషనర్ గానూ పనిచేశారు.
నీ గతేడాది జూన్ 22న జిల్లా కలెక్టర్గా వచ్చిన పి.ప్రశాంతి పాలనలో తనదైన ముద్ర వేశారు. శిశువుల్లో పౌష్టికాహార లోపం నివారించేందుకు 'చిన్నారి ఆరోగ్యం' పథకానికి ఈ ఏడాది మే 10న శ్రీకారం చుట్టారు. సీఎస్ఆర్ నిధులతో ప్రతి నెలా వారికి పౌష్టికాహారం అందేలా కార్యాచరణ చేసి అమలుచేస్తున్నారు.
బాలికల వసతి గృహాల్లో సౌకర్యాలకు చర్యలు చేపట్టారు. పాఠశాలల్లో గుడ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ, వారి సమస్యలు తెలుసుకునేందుకు ఆర్ట్స్ కళాశాలలోని ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా 'సంకల్ప్' కార్యక్రమాన్ని అమలుచేయించారు.
ఇసుక అక్రమ రవాణా అడ్డుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేసి చర్యలు చేపట్టారు. తాను అందుకున్న ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకునేవారని చెబుతారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షణతోపాటు భూ దస్త్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా మార్పులు జరిగినా, విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిపైనా కఠినంగా ఉండేవారు. ప్రస్తుతం బదిలీ అయిన ఆమెకు పోస్టింగ్ ఖరారు కావాల్సి ఉంది.
అటవీ శాఖలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దివాన్చెరువులో ఉన్న ఏపీ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న బి.విజయకుమార్ను శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్గా బదిలీ చేశారు.
నీ రాజమహేంద్రవరం పరిధిలోని ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రీజనల్ మేనేజర్ గా ఎస్.శ్రీకాంతనాథ్ను నియమించారు. ఇప్పటివరకు ఈయన రీసెర్చ్ అండ్ ఐటీ విభాగ సీసీఎఫ్ గా బాధ్యతలు నిర్వహించారు.