అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్(USA President Trump) బాధ్యతలను చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల(Indian students)కు కేంద్ర ప్రభుత్వం(Central Government) కీలక సూచనలు చేసింది. వీసాలు, వలస విధానాలపై నిర్ణయాలు ఆయా దేశాల విచక్షణాధికారాలకు సంబంధించినవని... వాటిని పాటించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంటుందని తెలిపింది. అమెరికా చట్టాలకు లోబడి అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు ఉండాలని సూచింది.
ఇది కూడా చదవండి: USA: F-1 విద్యార్థి వీసా నుండి H-1B వర్క్ వీసాకు మారుతున్నారా? కఠినతరం చేసే ఇమ్మిగ్రేషన్ విధానాలు! మరిన్ని వివరాలు మీ కోసం!
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అమెరికాలోని భారత ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలు(Consulate offices) సాయం అందిస్తాయని తెలిపింది. విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు మన చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని మనం భావిస్తామని... అదేవిధంగా మన పౌరులు విదేశాల్లో ఉన్నప్పుడు ఆయా దేశాల చట్టాలు, నిబంధనలను పాటించాలని విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ సూచించారు. చట్టవిరుద్ధ నిరసనలను అనుమతించే కాలేజీలు, యూనివర్శిటీలకు ఫెడరల్ నిధులను నిలిపివేస్తామని... ఆందోళనలకు పాల్పడే వారిని జైలుకు లేదా వారి స్వదేశానికి పంపించడం జరుగుతుందని ఇటీవల ట్రంప్(Trump) హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.
ఇది కూడా చదవండి: కులమే శాపమైంది.. జగన్, విడదల రజినీ మోసం చేశారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు.!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. ఓకే చెప్పిన జైషా.. అక్కడే ఫిక్స్.!
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త వాతావరణం.. కారణమిదే!
దారుణం.. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి! ఆసిఫ్ మృతికి గల కారణాలు.!
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం! తరిగొండ వెంగమాంబ సత్రంలో..
రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు! వీరప్పన్ కూతురికి ఆ పదవి ఫిక్స్!
చీప్.. వెరీ చీప్.. రూ. 599కే ఎయిర్ ఇండియా టికెట్.! ఈ బంపర్ ఆఫర్ మిస్సవ్వకండి.!
జగన్ పరిస్థితి అయోమయం.. సీఐడీ కస్టడీకి మాజీ ఎమ్మెల్యే.. ఆదేశాలు జారీ చేసిన కోర్టు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: