ఈరోజు ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం కావడమే ఇందుకు కారణం. శ్రీనగర్ నుంచి రావాల్సిన ఫ్లైట్ షెడ్యూల్ ప్రకారం రన్‌వేపైకి రాకపోవడంతో సుమారు 150 మంది ప్రయాణికులు గంటలతరబడి ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాశారు. విమానం ఆలస్యానికి గల కారణమై ఎయిరిండియా ప్రతినిధులను ప్రయాణికులు ప్రశ్నించారు. అయితే, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనగర్ నుంచి విమానం రాకముందే బోర్డింగ్ ఎందుకు ఇచ్చారంటూ ఆందోళనకు దిగారు. ఫ్లైట్ ఆలస్యం అవుతుందని ముందే సమాచారం ఇవ్వకుండా ఇలా విమానాశ్రయంలో వెయిట్ చేయించడం ఏంటని ప్రయాణికులు ఎయిరిండియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఎయిర్‌పోర్టులో గందరగోళం నెలకొంది.
ఇది కూడా చదవండి: కులమే శాపమైంది.. జగన్, విడదల రజినీ మోసం చేశారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు.!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
దారుణం.. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి! ఆసిఫ్ మృతికి గల కారణాలు.!
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం! తరిగొండ వెంగమాంబ సత్రంలో..
రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు! వీరప్పన్ కూతురికి ఆ పదవి ఫిక్స్!
చీప్.. వెరీ చీప్.. రూ. 599కే ఎయిర్ ఇండియా టికెట్.! ఈ బంపర్ ఆఫర్ మిస్సవ్వకండి.!
జగన్ పరిస్థితి అయోమయం.. సీఐడీ కస్టడీకి మాజీ ఎమ్మెల్యే.. ఆదేశాలు జారీ చేసిన కోర్టు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: