హీరో మోటోకార్ప్ ఇండియాలో రిలీజ్ చేసిన పాపులర్ స్పోర్ట్స్ బైక్ ‘హీరో ఎక్స్‌ట్రీమ్ 125R’ (Hero Xtreme 125R), గ్రాండ్ సక్సెస్ అయింది. కంపెనీ దీన్ని 2024 జనవరిలో లాంచ్ చేసింది.
ఎక్స్‌ట్రీమ్ లైనప్‌లో ఎక్కువ సేల్స్ నమోదు చేసిన మోడల్‌గా ఇది పాపులర్ అయింది. అయితే రీసెంట్‌గా హీరో బ్రాండ్ అప్‌డేటెడ్ 2026 ఎక్స్‌ట్రీమ్ 125Rను (2026 Hero Xtreme 125R) ఒక డీలర్‌షిప్ ఈవెంట్‌లో ఆవిష్కరించింది.
అప్పటి నుంచి ఇది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఇది అతి త్వరలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కొత్త బైక్ హైలెట్స్ చూద్దాం.
స్టైలిష్ బైక్హీరో ఎక్స్‌ట్రీమ్ 125R బైక్ మంచి స్టైల్ స్టేట్‌మెంట్, పెర్ఫార్మెన్స్, ఫ్యూయల్ ఎకానమీతో రైడర్లను ఇంప్రెస్ చేస్తోంది. స్పోర్టీ 125cc మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారింది.

ఇండియన్ మార్కెట్లో TVS రైడర్ 125, బజాజ్ పల్సర్ NS125, హోండా CB125 హార్నెట్ వంటి బైక్‌లతో పోటీ పడుతోంది. అయితే ఈ స్పోర్టీ, అర్బన్ కమ్యూటర్ బైక్ లేటెస్ట్ ఎడిషన్‌తో పోటీ బ్రాండ్లకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంది.
2026 ఎక్స్‌ట్రీమ్ 125Rలో రానున్న మార్పులు, ఫీచర్లు చూద్దాం. ముఖ్యమైన అప్‌డేట్స్ క్రూయిజ్ కంట్రోల్: 125cc మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో ఈ ఫీచర్‌ను అందించే మొదటి బైక్ ఇదే కావచ్చు.
కలర్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్: ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత మోడల్‌లో చిన్న LCD క్లస్టర్ ఉండగా, లేటెస్ట్ ఎడిషన్‌లో దీన్ని కంపెనీ రీప్లేస్ చేయనుంది. కొత్త కలర్
స్కీమ్ & గ్రాఫిక్స్: ఇది ఎక్స్‌ట్రీమ్ 250R మాదిరిగానే కొత్త రెడ్-బ్లాక్ కలర్ స్కీమ్, షార్ప్ గ్రాఫిక్స్‌తో రానుంది. రీసెండ్ ఈవెంట్‌లో ఇదే కనిపించింది.
డిజైన్ మార్పులు: లేటెస్ట్ ఎడిషన్‌లో కొత్త బార్-ఎండ్ మిర్రర్స్, కొంచెం పొడవైన హ్యాండిల్‌బార్ ఉండవచ్చు. ఇంజిన్, మెకానిక్స్హీరో ఎక్స్‌ట్రీమ్ 125R బైక్ 2026 ఎడిషన్‌లో కూడా మెకానికల్ పార్ట్స్ అవే కంటిన్యూ కావచ్చు.
దీంట్లో 124.7cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 11.4 bhp (11.55 PS) మ్యాగ్జిమం పవర్, 10.5 Nm పీక్ టార్క్ జనరేట్ చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్, 66 kmpl మైలేజ్, సింగిల్-ఛానల్ ABS బ్రేకింగ్ సిస్టమ్, సస్పెన్షన్ కోసం ముందు వైపు 37mm టెలిస్కోపిక్ ఫోర్కులు,
వెనుక వైపు మోనో-షాక్ లాంటి ఫీచర్లు ఉండవచ్చు. ధర ఎంత?ఈ 2026 ఎడిషన్ ధర ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఎడిషనల్ ప్రీమియం ఫీచర్లతో ధర పెరగనుంది.
కొన్ని రిపోర్ట్స్ ప్రకారం.. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R లేటెస్ట్ ఎడిషన్ (2026 మోడల్) ధరలు వేరియంట్ ఆధారంగా రూ.95,000 నుంచి రూ.1,02,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉన్నాయి. ఈ కొత్త బైక్ 2025 అక్టోబర్‌లోనే లాంచ్ కావచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే కంపెనీ దీని గురించి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.