ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగుల వేస్తోంది. మినీ అంగన్‌వాడీలను మెయిన్ అంగన్‌వాడీలుగా మార్చేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మంగళవారం జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. దీనివల్ల మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు జీతం పెరుగుతుంది. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపడుతుంది. అయితే మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలు పదో తరగతి పాసై ఉండాలి. ఈ నిబంధనను మినీ అంగన్‌వాడీలకు కూడా వర్తింపజేయనున్నారు. ఇప్పటికే మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వారిలో పది పాసైన వారిని మెయిన్ అంగన్‌వాడీలుగా మారుస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 4,600 మంది వరకు ఉన్నారని అధికారులు అంచనా వేశారు.

ఇది కూడా చదవండి:  టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


ప్రస్తుతం మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.7 వేలు జీతం ఉంది.. మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తగా మారితే రూ.11,500 జీతం లభిస్తుంది. అంటే ఒక్కొక్కరికి నెలకు రూ.4,500 జీతం పెరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా రూ.25 కోట్ల అదనపు భారం పడుతుంది. రాష్ట్రంలో మొత్తం 55,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటే.. వాటిలో 6,837 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మెయిన్ అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్త, ఆయా ఉంటారు. మినీ అంగన్‌వాడీ కేంద్రంలో కేవలం కార్యకర్త మాత్రమే ఉంటారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సేవలు అందించడానికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి.

ఇది కూడా చదవండి: ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ప్రస్తుతం మినీ అంగన్‌వాడీల్లో 200 వరకు ఖాళీలు ఉన్నాయి.. 4,600 మినీ కేంద్రాల్లో పనిచేస్తున్న వారు పదో తరగతి పాసయ్యారు. మిగిలిన చోట్ల పనిచేస్తున్న వారికి పదో తరగతి పాసయ్యేందుకు ఒక ఏడాది లేదా రెండేళ్ల గడువు ఇస్తారు. ఆ లోపు అర్హత సాధించిన వారిని మెయిన్ అంగన్‌వాడీలుగా మారుస్తారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో దాదాపు 300 చోట్ల ఐదుగురి కంటే తక్కువ లబ్ధిదారులు ఉన్నారు. గిరిజన ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉన్న వాటిని మాత్రం మార్చరు. మిగిలిన వాటిని హేతుబద్ధీకరించాలని ప్రతిపాదించారు. అంటే తక్కువ మంది లబ్ధిదారులు ఉన్న కేంద్రాలను దగ్గరలోని ఇతర కేంద్రాలతో కలపవచ్చు. దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group