ఇది కూడా చదవండి: highway: ఏపీలో ఆ హైవేను ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, కేంద్రానికి చంద్రబాబు లేఖ..! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాసాంధ్రుల సంక్షేమం, పెట్టుబడులు, సేవల ప్రోత్సాహానికి సంబంధించి ప్రముఖ పాత్ర పోషించే సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏ.పి.ఎన్.ఆర్.టి. సొసైటీ)కి కొత్త అధ్యక్షుడిని నియమించింది.
పూర్వ ఏపీఎన్నార్టీ ప్రెసిడెంట్, ప్రస్తుతం ఎన్నారై టీడీపీ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న డాక్టర్ రవి కుమార్ వేమూరును ప్రవాసాంధ్ర తెలుగు వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా, అలాగే ఏ.పి.ఎన్.ఆర్.టి. సొసైటీకి అధ్యక్షుడిగా ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని జూన్ 25, 2025న జారీ చేసిన ఉత్తర్వు (G.O.RT.No.1228) ద్వారా ప్రభుత్వం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!
ఈ నియామకానికి సంబంధించి పూర్తి విధివిధానాలను తరువాత ప్రకటించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఏ.పి.ఎన్.ఆర్.టి. సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీనికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ నియామక ఉత్తర్వు ఎస్. సురేష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ (పాలిటికల్) (ఇన్‌చార్జ్) విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: Palnadu Incident: పల్నాడులో పట్టపగలే దారుణం.. రోడ్డు పక్కన మంటల్లో మృతదేహం!
ఈ నిర్ణయం ద్వారా ప్రవాసాంధ్రుల సమస్యలను ప్రభుత్వం మరింత సమర్థంగా పరిష్కరించాలనే సంకల్పం ఉట్టిపడుతోంది. డాక్టర్ రవి కుమార్ వేమూరు గతంలో ఏపీ ఎన్నార్టీ సొసైటి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసి ఆ సంస్థను ఎన్నారైలకు చెదోడువాదోడుగా ఉండే విధంగా ఎంతో కృషి చేశారు. ఎన్నో వినూత్న కార్యక్రమాలను ఎన్నారైల కోసం చేపట్టి మంచి పేరు ప్రఖ్యాతులు ఆ సంస్థకు తీసుకువచ్చారు.
వీరినే తిరిగి నియమించడం ద్వారా ఈ సంస్థ మరింత చురుకుగా పని చేస్తుందని ప్రతి ప్రవసాంధ్రుడికీ మరింత అండగా నిలుస్తుందని కొనియాడుతూ వారి యొక్క నియామకం పట్ల ఎన్నారైలు హర్షాతిరేఖాలు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Tata Motors: రెండుగా విడిపోతున్న టాటా కంపెనీ! ఛైర్మన్ కీలక ప్రకటన!
ప్రభుత్వం డాక్టర్ రవి వేమూరు గారిని ఏపీ ఎన్నార్టీ సొసైటి ప్రెసిడెంట్ మరియు ప్రభుత్వ సలహాదారుడిగా నియమించిన శుభసందర్భంలో ఆంధ్రప్రవాసీ తరపున వారికి మా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.