ఇప్పుడు రైలు ప్రయాణం అంటే లగ్జరీ జర్నీ. కానీ ఒకప్పుడు రైళ్లలో టాయిలెట్లు (Toilets in Trains) లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. 1853లో భారతదేశంలో రైలు సేవలు ప్రారంభమైనప్పుడు ఈ సమస్య చాలా కామన్. స్టేషన్‌లలో దిగి పని పూర్తి చేయాల్సి వచ్చేది. దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడేవారు. ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ జర్నీలలో మరింత ఇబ్బందిగా ఉండేది. ఈ పరిస్థితిని మార్చిన ఒక సామాన్య వ్యక్తి ఒఖిల్ చంద్రసేన్. ఆయన ఒక లెటర్ ద్వారా రైల్వే అధికారులలో మార్పు తీసుకురాగలిగాడు. రైళ్లలో టాయిలెట్లు 1909లో వచ్చినప్పటికీ లోకో పైలట్లకు ఈ సౌకర్యం చాలా ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది. 2016 వరకు ఇంజిన్‌లలో టాయిలెట్లు లేవు. డ్రైవర్లు గంటల తరబడి ఇబ్బంది పడాల్సి వచ్చేది. 2016 తర్వాత తయారైన ఇంజిన్‌లలో టాయిలెట్ ఫెసిలిటీని చేర్చారు. ఇది లోకో పైలట్లకు భారీ ఊరటనిచ్చింది. ఈ మార్పు వారి పనితీరును మెరుగుపరిచింది. ఈ విషయంలో అప్పటి రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు కీలక పాత్ర పోషించారు.
ఇది కూడా చదవండి: అమరావతిని దెబ్బతీసేందుకు జగన్, భారతి కుట్ర! ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే..
ఈ సౌకర్యం డ్రైవర్ల ఆరోగ్యం, ఫోకస్‌ను మెరుగుపర్చింది. 1909 జులై 2న బెంగాల్‌లోని అహ్మద్‌పూర్ స్టేషన్‌లో ఒఖిల్ చంద్రసేన్‌కు జరిగిన సంఘటన రైల్వే చరిత్రను మలుపు తిప్పింది. ఆయన రైలు నుంచి దిగి స్టేషన్ టాయిలెట్‌కు వెళ్లారు. అయితే గార్డ్ విజిల్ ఊదడంతో రైలు కదిలింది. చేతిలో లోటా, ధోతీ పట్టుకుని పరుగెత్తిన ఒఖిల్ జారి పడ్డాడు. ఇది ఆయనకు అవమానకరంగా మారింది. ఈ ఘటనతో కోపోద్రిక్తుడైన ఆయన హబీబ్‌గంజ్ రైల్వే డివిజన్‌కు లెటర్ రాశారు. ఈ లెటర్ రైల్వే అధికారులను కదిలించింది. టాయిలెట్ సౌకర్యం అవసరాన్ని గుర్తించేలా చేసింది. ఒఖిల్ లెటర్ తర్వాత బ్రిటిష్ రైల్వే అధికారులు 1909లో 80 కి.మీ. పైబడి ప్రయాణించే రైళ్లలో టాయిలెట్లను ప్రవేశపెట్టారు. మొదట హై క్లాస్ కోచ్‌లలో మాత్రమే ఈ సౌకర్యం కల్పించారు. 1940ల నాటికి అన్ని కోచ్‌లలో టాయిలెట్లు కామన్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: కపుల్స్‌కి పండగే.. కీలక నిర్ణయం తీసుకున్న ఓయో! 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి...
ఈ టాయిలెట్లు ఓపెన్ హోల్ సిస్టమ్‌తో ఉండేవి. వ్యర్థాలు నేరుగా ట్రాక్‌లపై పడేవి. ఇది శానిటేషన్ సమస్యలను తెచ్చినప్పటికీ.. ప్రయాణికులకు భారీ ఊరటనిచ్చింది. మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఈ మార్పుతో ఎక్కువ ప్రయోజనం పొందారు. మొదట టాయిలెట్లు (Toilets in Trains) ట్రాక్‌లపై వ్యర్థాలను వదిలేవి. ఇది రైల్వే ట్రాక్‌లను దెబ్బతీసేది. 2010లో DRDO సహకారంతో బయో టాయిలెట్లను ప్రవేశపెట్టారు. ఈ టాయిలెట్లు బ్యాక్టీరియా ద్వారా వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి నీళ్లు, మీథేన్ గ్యాస్‌గా మారుస్తాయి. 2021 నాటికి దాదాపు 2.58 లక్షల బయో టాయిలెట్లను 73,078 కోచ్‌లలో అమర్చారు. ఇది రూ. 400 కోట్ల ట్రాక్ మెయింటెనెన్స్ ఖర్చును ఆదా చేసింది. ఈ బయో టాయిలెట్లు శానిటేషన్ సమస్యలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడాయి. మొదటి ఓపెన్ హోల్ టాయిలెట్లు శానిటేషన్ సమస్యలను తెచ్చాయి. ట్రాక్‌లపై వ్యర్థాలు పడటం వల్ల రైల్వే ట్రాక్‌లు దెబ్బతినేవి. పర్యావరణం కలుషితమయ్యేది. 2010లో బయో టాయిలెట్ల ఆవిష్కరణ ఈ సమస్యను గణనీయంగా తగ్గించింది. 2023లో రాంచీ రాజధాని ట్రైన్‌లో ఆటోమేటిక్ హైజీన్, అడోర్ కంట్రోల్ సిస్టమ్‌తో కొత్త బయో-టాయిలెట్లను పైలట్ ప్రాజెక్ట్‌గా పరీక్షించారు. ఈ టాయిలెట్లు టచ్-ఫ్రీ సెన్సార్ ట్యాప్‌లు, సోప్ డిస్పెన్సర్‌లతో మరింత సౌకర్యవంతంగా ఉన్నాయి. రైల్వే శానిటేషన్ ఇప్పుడు మరింత ఆధునిక దిశగా పయనిస్తోంది.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: