మనము ప్రతిరోజు తినే ఆహారం మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. కానీ ఆహారంలో మంచి పోషకాలు ఉండాలి అంటే సరైన పదార్థాలు తినాలి. ముఖ్యంగా మాంసాహారం తినేవారు తలకాయ కూరను చాలా ఇష్టంగా తింటారు. మేక లేదా గొర్రె తలతో వండే ఈ కూర రుచిగా ఉండటమే కాకుండా శక్తివంతమైన పోషకాలు అందిస్తుంది. అందుకే పల్లెలో కానీ, పట్టణాల్లో కానీ దీని డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.
బాలింత స్త్రీకి తలకాయ కూర వండి పెట్టడం ద్వారా ఆమె త్వరగా కోల్పోవడంతో పాటు బిడ్డ కూడా మంచి పోషకాలు అందుతాయి అని పురాతన కాలం నుంచి వస్తుంది. మరి ముఖ్యంగా మెదడుకు చాలా మంచిదని కూడా ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
తరచూ కాకుండా నెలలో ఒకసారైనా చిన్నపిల్లలకి సూప్ లా తయారు చేసి ఇవ్వడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఎక్కువ కారాలు మసాలాలు వేయకుండా సింపుల్ గా కాస్త మిరియాలు ఉప్పు పచ్చిమిరపకాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తయారు చేసుకుంటే ఆహా అనాల్సిందే ఎవరైనా ఇది పిల్లలకి ఇవ్వడం ద్వారా వారికి జలుబు అనేది దరికి చేరచేరదటదట.
ఈ కూరలో ప్రోటీన్, ఐరన్, క్యాల్షియం, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అవసరమైనవి. ముఖ్యంగా కండరాలు బలంగా ఉండటానికి, నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి తలకాయ కూర చాలా ఉపయోగపడుతుంది. ఎముకలకు బలం, కండరాలకు శక్తి వస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
తలకాయ కూరలోని ప్రోటీన్ వల్ల కండరాలు బలపడతాయి. అలాగే క్యాల్షియం ఉండటం వల్ల ఎముకలు బలంగా మారతాయి. పెద్దలు, పిల్లలు తిన్నా శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. కష్టం చేసే వారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారికి ఇది చాలా బలమిస్తుంది. అందుకే దీనిని బలవర్ధక ఆహారం అంటారు. తలకాయ కూరలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకే తరచుగా లేదా ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బరువు తగ్గాలని భావించే వారు పరిమితంగా తినాలి.
ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్య పరిస్థితి బట్టి ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి తీసుకోవడం మంచిదని తెలియజేయడం జరుగుతుంది.