భారత చెస్ క్రీడలో కొనేరు హంపి మరోసారి తనదైన ముద్రను వేసుకున్నారు. ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కి చేరిన తొలి భారత మహిళా చెస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు.ఈ ఘనతో భారతదేశ చెస్ స్థాయిని అంతర్జాతీయంగా మరింత పెరిగేలా చేసింది.
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హంపి చైనా గ్రాండ్ మాస్టర్ యుక్సిన్ సాంగ్‌పై విజయం సాధించింది. రెండు ఆటల్లోనూ చక్కని వ్యూహంతో ఆటను ఆడారు. అయితే కొన్ని సార్లు చిన్న చిన్న తప్పులు చేసినా, వెంటనే వాటిని తెలివిగా సరిదిద్దారు. పత్యర్ధి వేసే ఎత్తులను ముందే పసిగట్టి, ఆట ఆడడం వల్లే ఆమె విజేతగా నిలిచారు. దీంతో కోనేరు హంపి సెమీఫైనల్‌కు చేరారు.
హంపి సెమీ ఫైనల్‌కు చేరడంతో భారత మహిళా చెస్‌కు అంతర్జాతీయంగా మరింత గుర్తింపు లభించింది. ఇప్పటికే ప్రపంచ చాంపియన్ షిప్ స్థాయిలో అనేక విజయాలు అందుకున్న హంపి మరోసారి ప్రతిభను కనబరచడంతో దేశవ్యాప్తంగా ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి…