ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విశాఖపట్నంలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాల భూమిని ఎకరా రూ.99పైసల చొప్పున కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ కంపెనీ రూ.1582.98 కోట్ల పెట్టుబడితో పెట్టుబడి పెట్టి 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.

ఇది కూడా చదవండి: New Muncipalities: రాష్ట్రంలో కొత్తగా రెండు మున్సిపాలిటీలు.. మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్! ఆ గ్రామాలకు మహర్దశ

అదేవిధంగా అమరావతి రాజధానిలో పరిపాలనా భవనాల నిర్మాణానికి సంబంధించిన టెండర్లు దక్కించుకున్న సంస్థలకు అనుమతులు మంజూరు చేసే అంశాన్ని కూడా మంత్రివర్గం ఆమోదించే అవకాశముంది. ఇందులో రూ.882.47 కోట్లతో GAD టవర్, రూ.1487.11 కోట్లతో హెచ్‌ఓడీ కార్యాలయాలు, రూ.1303.85 కోట్లతో ఇతర పరిపాలనా భవనాల నిర్మాణాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ చట్టంలోని కొన్ని నిబంధనల్లో సవరణలు చేసి, పట్టణాభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

ఇది కూడా చదవండి: Employement News: డిగ్రీ అర్హతతో నాబార్డులో స్పెషలిస్ట్ పోస్టులు! ఎగ్జామ్ లేదు.. ఇంటర్వ్యూ మాత్రమే!

అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్‌కు స్పోర్ట్స్ కోటాలో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని కల్పించే అంశంపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి స్వస్థలమైన కుప్పం నియోజకవర్గంలో నీటి వనరుల అభివృద్ధికి సంబంధించిన 51 పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే 49వ CRDA అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది.

ఇది కూడా చదవండి: Tunnel works: సొరంగ మార్గానికి రూ.920 కోట్లు! ఇక దూసుకెళ్లిపోవచ్చు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

 Sarkar Decision: ఏపీ సర్కారు షాకింగ్ డెసిషన్! నేడు కీలక భేటీ!

South India Tour: ఒకే ట్రిప్​లో "పద్మనాభ స్వామి టూ మదురై మీనాక్షి"! ప్యాకేజీలు ఇవే!

TTD Scan Process: టీటీడీ కీలక నిర్ణయం! జస్ట్ ఇలా స్కాన్ చేస్తే చాలు.. క్యూలైన్లో నిలబడక్కర్లేదు!

Ration Cutting: రేషన్‌కార్డు లబ్ధిదారులకు షాక్.. ఇకపై వారికి కట్! లిస్టులో మీరున్నారా?

Cancer Hospital: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన నందమూరి బాలకృష్ణ! హైదరాబాద్ వెళ్లే పని లేకుండా!

Oil Supply Issues: హార్మూజ్ జలసంధి మూసివేత వైపు ఇరాన్? భారత్‌లో ఆయిల్ పరిస్థితిపై కేంద్రం కీలక ప్రకటన!

Singayya Case: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్! ఆ కేసులో ఏ2గా - డ్రైవర్ అరెస్ట్.?

security Lapses: నలుపురంగు కారులో వచ్చి.. జగన్ ఇంటిపై విసిరేసి వెళ్లాడు! సీసీటీవీ ఫుటేజీలో.!

Sajjala Criminal Case: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు.. వివరాలు ఇవే.!

Former Minister Case: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్ పర్యటనలో నిషేదాజ్ఞల ఉల్లంఘన! మాజీ మంత్రిపై కేసు నమోదు!

AP Inner Ring Road: ఏపీలో కొత్తగా మరో ఇన్నర్ రింగ్ రోడ్డు.. అక్కడేమారనున్న రూపురేఖలు! వారి కళ్ళల్లో ఆనందం..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group