టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవల టీటీడీ జూనియర్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాలేజీలో వివిధ సమస్యలను గుర్తించామని తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. కాలేజీ, హాస్టళ్లలో మరింత ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.
టీటీడీ జూనియర్ కాలేజీకి సంబంధించి పూర్తిస్థాయి బాధ్యతలు జేఈవోకు అప్పగించామని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని విద్యాసంస్థల్లో సౌకర్యాలు మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీవారి ఆశీస్సులతో విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించేందుకు టీటీడీ కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.