మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా !! అయితే మీకు ఒక శుభవార్త ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి AIIMS మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 121 బోధనా సిబ్బంది (Faculty) పోస్టులు భర్తీ చేయనున్నారు. వైద్యరంగంలో ఉన్నత చదువు అనుభవం ఉన్నవారికి ఇది మంచి అవకాశం అని అధికారులు తెలుపుతున్నారు.
మొత్తం ఖాళీలు: 121
ప్రొఫెసర్ – 10 పోస్టులు
అడిషనల్ ప్రొఫెసర్ – 08 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్ – 20 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 83 పోస్టులు
అర్హతలు
ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ, ఎంహెచ్ డిగ్రీ తప్పనిసరి.
కనీసం 60% మార్కులు ఉండాలి.
సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.వయోపరిమితి
గరిష్ట వయసు: 58 సంవత్సరాలు
వయస్సులో సడలింపులు:
ఎస్సీ / ఎస్టీ – 5 సంవత్సరాలు
ఓబీసీ – 3 సంవత్సరాలు
PwBD – 10 సంవత్సరాలు
ప్రభుత్వ ఉద్యోగులు – 5 సంవత్సరాలు
వేతనాలు (7వ వేతన కమిషన్ ప్రకారం)
ప్రొఫెసర్ – రూ.1,68,900/-
అడిషనల్ ప్రొఫెసర్ – రూ.1,48,200/-
అసోసియేట్ ప్రొఫెసర్ – రూ.1,38,300/-
అసిస్టెంట్ ప్రొఫెసర్ – రూ.1,01,500/-
దరఖాస్తు విధానం
ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: అక్టోబర్ 26, 2025
ఫీజు
జనరల్ / EWS / OBC – రూ.3,100/-
ఎస్సీ / ఎస్టీ / మహిళలు – రూ.2,100/-
PwBD – ఫీజు లేదు.
ఎంపిక విధానం
ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
ఇంటర్వ్యూకు వస్తున్నవారు తమ అసలు సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలి.
ముఖ్య సూచనలు
దరఖాస్తు చేసేముందు అవసరమైన అన్ని పత్రాలను స్కాన్ కాపీగా సిద్ధం చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాతే ఫీజు చెల్లింపు ఆప్షన్ వస్తుంది. ఇంటర్వ్యూ తేదీలు, షెడ్యూల్ తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత ఉంటే మరల దానికి వేర్వేరుగా దరఖాస్తు చేయాలి.
మరిన్ని వివరాల కోసం ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోండి.
aiimsmangalagiri.edu.in/vacancies