Bus stand: ఏపీలో కొత్తగా బస్టాండ్! ఆ ప్రాంతంలో ఫిక్స్! మరిన్ని బస్సుల్లో స్త్రీశక్తి పథకం విస్తరణ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సంపన్న వర్గాలు పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభ్యున్నతి కోసం కృషి చేయాలి. దత్తత తీసుకునే వారిని మార్గదర్శులు, పేద కుటుంబాలను “బంగారు కుటుంబాలు”గా ప్రభుత్వం నామకరణం చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ఆయన బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహించారు.

RRR: రీజనల్ రింగ్ రోడ్ కీలక అప్డేట్! టెండర్లు గడువు మరోసారి పొడిగింపు!

ఈ పథకం సమర్థవంతంగా అమలుచేయడానికి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రతి ఉద్యోగికి మూడు క్లస్టర్లను కేటాయించి, ఆ క్లస్టర్లలో పీ-4 కార్యక్రమం అమలుకు మార్గదర్శులు, బంగారు కుటుంబాల మధ్య సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ప్రత్యేక యాప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది.

Caste Reservations: ఏపీలో ఆ కులం ఓసీ లోకి... ప్రభుత్వం ఫుల్ క్లారిటీ!

అయితే ఈ కొత్త బాధ్యతలపై కొంతమంది సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించేవారు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ రద్దయి, ఆ బాధ్యతలు సచివాలయ ఉద్యోగులపైనే పడుతున్నాయి. ప్రతి ఉద్యోగికి మూడు క్లస్టర్లు అప్పగించడంతో పని భారం పెరిగిందని వారు భావిస్తున్నారు.

Local Body Elections: నాలుగు దశల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! షెడ్యూల్ ఇదే!

కొన్నిచోట్ల సచివాలయ ఉద్యోగులు నిరసనలు కూడా చేపట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే, పీ-4 పథకం, వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారం వంటి అదనపు పనులు ఇవ్వడం తగదని వారు అభిప్రాయపడుతున్నారు. వాలంటీర్లకు ఒక్కోరికీ 50 ఇళ్ల బాధ్యతలు ఇచ్చినప్పటికీ, ఇప్పుడు క్లస్టర్ల రూపంలో ఎక్కువ పని భారం తమపై మోపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Medical college: ఏపీలో 10 కొత్త మెడికల్‌ కాలేజీలు..! పీపీపీ విధానంలో నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌!

అయినా సరే, ప్రభుత్వం మాత్రం పీ-4 పథకాన్ని విస్తృత స్థాయిలో అమలు చేయాలని సంకల్పించింది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి కలగడం, గ్రామీణ స్థాయిలో పేదరిక నిర్మూలన వేగవంతం కావడం లక్ష్యం. సచివాలయ ఉద్యోగులు ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తే, పథకం విజయవంతం అవుతుందని ప్రభుత్వం నమ్ముతోంది.

New Airport: ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! కొత్తగా విమానాశ్రయం.. రూ.916 కోట్లతో! ఆ జిల్లా దశ తిరిగినట్లే!
Nara Lokesh: నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు! ఎందుకంటే!
Fee Schedule: ఇంటర్ ఫీజులపై బిగ్‌ అలర్ట్‌..! ఆ లోపు చెల్లించకపోతే జరిమానా తప్పదు..!
OPPO Smart Phone: ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లు! కేవలం రూ.2 వేలకే 5G స్మార్ట్ ఫోన్! ఫుల్ డిటైల్స్..
SSC CGL: అడ్మిట్‌ కార్డులు అవుట్‌..! 129 నగరాల్లో ఎస్సెస్సీ సీజీఎల్‌ టైర్‌–1 పరీక్షలు!
Turakapalem: తురకపాలెం ప్రజలకు మంత్రి భరోసా.. పుకార్లకు లోనవ్వొద్దు!