మన వంటగదిలో రుచిని పెంచే కరివేపాకు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరమైంది. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో దీనిని నమలడం వల్ల అనేక వ్యాధులను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం, కరివేపాకులో ఉండే సహజ గుణాలు కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
కరివేపాకు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను (HDL) పెంచుతుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఉదయం దీనిని నమలడం ద్వారా రక్తనాళాలు శుభ్రంగా ఉండి, గుండెపోటు వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
మధుమేహ రోగులకు కూడా కరివేపాకు ఎంతో మంచిది. ఇందులోని యాంటీ-డయాబెటిక్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ప్రభావం మెరుగుపడుతుంది. చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం వంటి సమస్యలు తగ్గిపోతాయి.
జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి కూడా కరివేపాకు ఉపశమనాన్ని ఇస్తుంది. గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరం నుండి విషపదార్థాలను తొలగించి, శరీరాన్ని శుభ్రపరుస్తుంది. బరువు తగ్గాలని కోరుకునే వారికి కూడా ఇది ఉపయోగకరం. ఇందులోని ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్లు కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో తోడ్పడతాయి.
కరివేపాకు కళ్ళు, చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ A, C కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు మూలాలను బలపరుస్తాయి. నిపుణుల సూచన ప్రకారం, ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో 5 కరివేపాకులు నమిలి, గోరువెచ్చని నీటితో తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.