డ్వాక్రా మహిళలకు ఆర్థిక భారం తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని అద్భుతమైన రెండు కొత్త పథకాలను త్వరలో ప్రకటించనున్నారు. డ్వాక్రా పథకాన్ని 1982-83 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టారు.ఈ డ్వాక్రా ద్వారా మహిళలు ఎంతో లాభం పొందుతున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు 2019 లో చంద్రబాబు ప్రభుత్వం పసుపు కుంకుమ ద్వారా ఆర్థిక సహాయం చేసిన విషయం కూడా అందరికీ తెలిసినదే.
చంద్రబాబు ప్రభుత్వంలో మరో రెండు కొత్త పథకాలకు డ్వాక్రా ద్వారా ప్రవేశపెట్టబోతోంది. పిల్లల విద్యా ఖర్చుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఆడబిడ్డల వివాహాం కొరకు ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకాలు త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది.
ఈ పథకాలను సంబంధించిన అన్ని పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపారని సమాచారం. అయితే పలు సాంకేతిక మరియు కొన్ని మార్పులు కారణాల వల్ల
కాస్త సమయం తీసుకుంటున్నారు మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు.
అయితే ఈ పథకం ఎవరికి వర్తిస్తాయి అన్న విషయాలను ముందుగా తెలుసుకోండి.ఈ రెండు పథకాలు ముఖ్యంగా డ్వాక్రా సంఘంలో కనీసం ఆరు నెలలుగా సభ్యులుగా ఉన్న మహిళలకు మాత్రమే వర్తిస్తాయి. అదేవిధంగా బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి లేదా ఇతర మార్గాల్లో తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నవారికి మాత్రమే అర్హత కలిగి ఉంటారు. ఈ మొత్తం ప్రక్రియ బయోమెట్రిక్ ద్వారా నిర్వహించనున్నారని సమాచారం.
ఈ పథకం ఇద్దరు పిల్లలు చదువు కోసం రుణ సహాయం పొందా స్త్రీలకు అయితే బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ పథకం 10,000 నుంచి లక్ష రూపాయల వరకు రుణాన్ని అందిస్తుంది.వడ్డీ రేటు కేవలం పావలా వడ్డీ మాత్రమే. 48 వాయిదాలలో రుణం చెల్లించాల్సి ఉంటుంది
దీనికి సంబంధించిన పత్రాలు ఏమిటంటే కాలేజీ స్కూల్
అడ్మిషన్ లెటర్ ఫీజు రసీదు, విద్యాసంస్థ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.దరఖాస్తు చేసిన 48 గంటల్లోపే బ్యాంక్ ఖాతాలో నేరుగా నగదు జమ అవుతుంది అని అధికారం తెలిపారు.
ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాలకు ఆర్థిక చేయూతగా ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. వివాహ సమయంలో ఖర్చులకోసం వ్యాపారుల దగ్గర అధిక మొత్తంలో అధిక మొత్తంలో వడ్డీ రూపంలో తీసుకోవడం కన్నా ఈ పథకం ద్వారా తీసుకుంటే తక్కువ వడ్డీతో అధిక లాభాలను పొందవచ్చు. పథకం ద్వారా 10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణం లభిస్తుంది. పావలా వడ్డీ రేటు 48 వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి కావాల్సిన పత్రాలు లగ్నపత్రిక, వివాహ ఖర్చుల అంచనా పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అధికారులు వివరాల పరిశీలన అనంతరం వధువు తల్లిదండ్రుల ఖాతాలో నేరుగా డబ్బు జమ అవుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పథకాల అమలుకు ప్రతి ఏడాది రూ.2000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. అందులో విద్యాలక్ష్మి కోసం రూ.1000 కోట్లు.. కళ్యాణ లక్ష్మి కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేయనుంది. అయితే ఈ పథకం ద్వారా చే వడ్డీని 50 శాతం డ్వాక్రా సంఘాల బలోపేతానికి చేయడానికి మిగిలిన 50 శాతం స్త్రీనిధి ఉద్యోగుల కేటాయించనున్నారని సమాచారం.ఈ పథకాలు ద్వారా రుణం తీసుకున్న మహిళ ప్రమాదంలో మరణిస్తే పూర్తి రుణం రద్దు చేస్తారు