తెలుగు సీరియల్స్‌లో అత్యధిక రేటింగ్ ఉన్న సీరియల్ మాటీవీలో వస్తున్న కార్తీకదీపం. ఈ సీరియల్ వచ్చిందంటే చాలు, ఇంట్లో పనులన్నీ ఆపేసి టీవీ ముందర కూర్చుంటారు. యువత నుంచి వృద్ధుల వరకు అందరినీ ఈ సీరియల్ కట్టిపడేసింది. ఈ రోజు కార్తీకదీపం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంది.
కార్తీక్, దీప వంటగదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అమ్మని, మీ నాన్నని కలపడానికి ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్లున్నావు అని కార్తీక్ అంటే ఇద్దరూ ఎంత మంచివాళ్లో అంతే మొండివాళ్లు అంటుంది దీప. అమ్మ కంటే నాన్నే నన్ను కొంచెం అర్థం చేసుకుంటారని ఆయనతో మాట్లాడాను. కానీ ఆయన నీ వయసు సరిపోదు అమ్మ అని అన్నారంటుంది. అప్పుడు కార్తీక్ నీతి ఏంటి అడిగితే ప్రేమించే భర్తకు భార్య గురించి మరొకరు చెప్పే అవసరం ఉండదు అని దీప సమాధానం చెబుతుంది.
అంతలో కార్తీక్ దీనిమీద మీటింగ్స్ కూడా పెట్టుకున్నారు అని అంటాడు. జ్యోత్స్న మారదు అని దీప అంటుంది. కార్తీక్ మనం కలుపుదాంలే అంటే ఏంటి కలిపేది? మా అమ్మానాన్న ఇద్దరూ మొండివాళ్లే అంటుంది దీప. అంతలో జ్యోత్స్న ఆ మాట వినేస్తుంది. అప్పుడు కార్తీక్, దీప షాక్ అవుతారు. అమ్మానాన్న, అమ్మానాన్న అంటుంది. ఎవరు? అని అడుగుతుంది జ్యోత్స్న. ఏదో మా గురించి మేము మాట్లాడుకుంటున్నాంలే అని కార్తీక్ అంటాడు. అప్పుడు జ్యోత్స్న మనసులో అమ్మానాన్న అంటే దశరథ సుమిత్రాని అనుకుంటున్నట్లుంది అని ఊహించుకుంటుంది. కార్తీక్ ను కార్ కిస్ తీసుకున్న కార్ క్లీన్ చేసావా అని అడుగుతుంది. కార్తీక్ క్లీన్ చేశాను అని చెప్తాడు. జ్యోత్స్న అప్పుడు బయటికి వెళ్దాం రా అని చెప్పేసి కార్తీక్‌ని బయటకు తీసుకుని వెళ్లిపోతుంది.
జ్యోత్స్న, పారు (పారిజాతం), కార్తీక్ ముగ్గురూ కలిసి శ్రీధర్ వాళ్ల ఇంటికి వెళ్తారు. అప్పటికే శ్రీధర్, కావేరి కాశీ గురించి మాట్లాడుకుంటారు. కాశీ ఇబ్బంది పడుతున్నాడనుకుంటా వాళ్లకి ఇంకో ఇల్లు చూద్దాము
అని కావేరి అంటుంది. వాళ్ళిద్దరికీ ఇల్లు చూస్తే, వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఇంకెంతో సమయం పట్టదు, వద్దు ఇక్కడే ఉండనివ్వండి అని శ్రీధర్ చెబుతాడు. అంతలో పారిజాతం, జ్యోత్స్న ఇంట్లోకి వస్తారు.
శ్రీధర్ వాళ్ళని పలకరించి కూర్చోండి అత్తయ్యా అని అంటాడు. పారిజాతం, జ్యోత్స్న, మాకు మర్యాదలేమీ వద్దులే అని ఎటకారంగా అంటారు. స్వప్న వచ్చి ఏంటి మీరు మా ఇంటికి వచ్చారు అని అడుగుతుంది. మనమంతా ఒకే కుటుంబం అనేసి పారిజాతం అంటుంది. అంతలో పారిజాతం నా మనవడు ఎక్కడ అని స్వప్నని అడుగుతుంది. నా భర్త గురించి నీకెందుకు అని స్వప్న అంటుంది. నీకు భర్త కాకముందే నా మనవడు అని పారిజాతం అంటుంది. ఇలా వీళ్లిద్దరి మధ్య కొంచెం ఫన్నీగా సంభాషణ జరుగుతుంది.
అంతలో కాశీ పారిజాతాన్ని, జ్యోత్స్నాని మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? అని అడుగుతాడు. ఇలా తగ్గిపోయావేంట్రా, ఇలా అయిపోయావేంట్రా? ఉద్యోగం లేకపోతే ఇలా అయిపోతావా?అని పారిజాతం అడుగుతుంది. జ్యోత్స్న కాశీతో నాకు తెలిసిన ఫ్రెండ్‌తో ఐటీ కంపెనీలో జాబ్ ఇప్పిస్తాను అంటుంది. ఫోన్ కోసం అటూ ఇటూ చూసుకున్న జ్యోత్స్నకు ఫోన్ లేకపోవడంతో స్వప్నతో బయట కారు దగ్గర డ్రైవర్ ఉంటారు, ఫోన్ తీసుకొని నా హ్యాండ్‌బ్యాగ్ తీసుకురమ్మని చెప్పు అని చెప్పింది. స్వప్న వెళ్లి చూడగానే కార్తీక్ కనిపిస్తాడు. కార్తీక్ కాశీతో జాబ్ లేకపోతే ఇలా అయిపోతారా? నీ ప్రయత్నం నువ్వు చేయాలి అని కాశీకి చెప్తాడు. జ్యోత్స్న మా ఫ్రెండ్‌తో రికమెండేషన్ చేయిస్తానని కాశీకి చెప్తే, నాకు ఎవరి రికమెండేషన్స్ వద్దు, నా ప్రయత్నం నేను చేసుకుంటాను అని కాశీ అంటాడు.
ఇంతలో సుమిత్ర కార్తీక్‌కు ఫోన్ చేసి దీప కళ్ళు తిరిగి పడిపోయింది అని చెబుతుంది. కార్తీక్ సుమిత్రతో రాత్రి నుంచి భోజనం ఏం తీసుకోలేదు అందుకే పడిపోయి ఉంటుంది అని చెప్పి, నేను త్వరగా వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. సుమిత్ర దీపను లేపి మంచినీళ్లు తాగిస్తుంది. ఎవరి మీద ఉన్న కోపం భోజనం మీద చూపించుకోకు అని చెప్పేసి, భోజనం తీసుకొచ్చి దీపకిస్తూ భోజనం మాత్రమే ప్లేట్‌లో వేయిస్తాను, అంతేగానీ ముద్దలు కలిపి పెట్టను అంటూ మాటలతో రేపటి భాగానికి తెర పడుతుంది.