ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న Deepam 2 Scheme కింద ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అందని విషయమై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. దీపం పథకం మొదటి దశలో కోటి మందికి, రెండవ దశలో 95 లక్షల మందికి subsidy ఇచ్చినట్లు తెలిపారు.
మూడవ దశలో సాంకేతిక సమస్యలు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రజల నుంచి అదనపు charges వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాయితీ డబ్బులు అకౌంట్‌లో జమ కాకపోతే టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కావడం లేదన్న ఫిర్యాదులపై మంత్రి స్పందిస్తూ.. ఈకేవైసీ, NPCI మ్యాపింగ్ సరిగా పూర్తి కాలేదన్న కారణాలను గుర్తించారు. ఓ కుటుంబానికి రెండు మూడు ఖాతాలుండటం, ఆధార్ లింక్ అవ్వకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఆగస్ట్ 25 నుంచి Smart Ration Cards పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రజల రేషన్ సరుకుల పంపిణీ సజావుగా సాగేందుకు చట్టాల్లో మార్పులు చేసినట్టు చెప్పారు.