Coolie movie: ఆ హీరో రిజెక్ట్ చేసిన క్యారెక్టర్... నాగార్జునకి వరం అయిందా!

ఈ రోజుల్లో చాలామంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. తక్కువ బరువుతో ఉండాలని, స్లిమ్‌గా కనిపించాలని అనుకోవడం తప్పు కాదు. అయితే "డైట్" అనే పేరుతో చాలామంది తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయి.

Special Train: గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‏న్యూస్..! వెలంకనికి ప్రత్యేక రైలు!

ఒకవేళ డైట్ అంటే తినకుండా ఉండటం అనుకుంటే అది చాలా పెద్ద అపోహ. అసలు డైట్ అంటే ఏమిటో చాలా మందికి సరిగ్గా అర్థం కావడం లేదు. కొన్ని గంటలు పూర్తిగా తినకుండా ఉండటం, ఆకలిని అదుపు చేయడం కోసం నీళ్లు మాత్రమే తాగుతూ ఉండటం వంటి చర్యలు ఆరోగ్యాన్ని ముప్పు లోనిచేస్తాయి. ఇది శరీరంలో ఎనర్జీ స్థాయిని తగ్గించి, లీవర్, కిడ్నీ వంటి అవయవాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పాక్‌లో ఆందోళనలు..! వందలాది మంది అరెస్ట్!

వైద్యులు చెబుతున్న మాట స్పష్టం డైట్ అంటే భోజనాన్ని మానేయడం కాదు, భోజనాన్ని సమయానికి, సరైన పరిమితిలో తినడమే డైట్. శరీరానికి కావాల్సిన పోషకాలను సమతుల్యంగా పొందేలా ఆహారం తీసుకోవడమే మేలు. ఉదాహరణకు బియ్యం తగ్గించి గోధుమ రొట్టెలు, బ్రౌన్ రైస్ వంటివి తీసుకోవచ్చు. పంచదార, మైదా, జంక్ ఫుడ్ వంటివి తగ్గించాలి. కానీ పూర్తిగా ఆహారం మానేయడం మంచి పని కాదు.

Guntur GGH: జీజీహెచ్‌లో అద్భుతం.. గుంటూరులో పేదవాడికి ఉచిత వైద్యం! ప్రభుత్వ ఆసుపత్రిపై పెరుగుతున్న నమ్మకం!

కొంతమంది డైట్ పేరుతో కొవ్వు పదార్థాలు, మాంసాహారం, స్వీట్లు పూర్తిగా మానేస్తుంటారు. ఇవన్నీ సరైన మోతాదులో తీసుకుంటే శరీరానికి హాని లేదు. ముఖ్యంగా నొప్పులు, తలనొప్పి, విటమిన్ లోపాలు వంటి సమస్యలు ఎక్కువగా తినకుండా ఉండే వారిలోనే కనిపిస్తున్నాయి.

P4 initiative: బంగారు కుటుంబాలు.. పీ-4 కార్యక్రమంతో కొత్త ఆశలు! చంద్రబాబు కీలక ప్రకటన - అలా అస్సలు చేయొద్దు!

ఇంకొంతమంది షార్ట్‌కట్ డైట్ పథకాలవైపు వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. లిక్విడ్ డైట్, ఫ్రూట్ డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాంటి వాటిని వైద్యుల సలహా లేకుండా ఫాలో అవడం ద్వారా శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. దీని వల్ల వచ్చే రిజల్ట్స్ తాత్కాలికమే కానీ, దుష్పరిణామాలు దీర్ఘకాలికంగా ఉండొచ్చు.

Liquor Bottles: రైలులో మద్యం తీసుకెళ్లొచ్చా? రాష్ట్రానుసారంగా నిబంధనలు ఇవే!

కాబట్టి, డైట్ అనేది ఒక జీవనశైలి మార్పు. తినే విధానంలో చిన్న చిన్న మార్పులతో, వ్యాయామాన్ని భాగం చేసుకుంటూ, నీటి వినియోగాన్ని పెంచుతూ సురక్షితంగా బరువు తగ్గవచ్చు. హెల్తీ లైఫ్‌స్టైల్ అనేది మజ్జిగ తాగే పని కాదు కానీ, తక్కువ తినడమో లేక తినకుండా ఉండడమో మాత్రం సమస్యలకే invite.

Government Schemes: 30 ఏళ్లు దాటిన వారికి గుడ్ న్యూస్! కేవలం రూ.500 పెడితే చాలు... ఈ మూడు పథకాలతో లక్షలు పొందవచ్చు!

ఆరోగ్యంగా బతకాలని అనుకుంటే వైద్యుల సలహాతో, శరీరానికి అవసరమైన సమతుల్య ఆహారాన్ని సరైన సమయంలో తినాలి. ఆకలిని మానుకోవడం కాదు, ఆహారాన్ని తెలివిగా ఎంచుకోవడమే నిజమైన డైట్.

Ukraines First Lady : జైపూర్లో ఉక్రెయిన్ ఫస్ట్ లేడీ.. ఎందుకొచ్చారంటే?
Uttarakhand :ఉత్తరాఖండ్లో విలయం.. 50 మందికి పైగా గల్లంతు!
Liquor: ఏపీ సర్కార్ బంపరాఫర్..! గీత కార్మికులకు 10 శాతం బార్ షాపులు!