తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో వెలసిన వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాలను పురస్కరించుకొని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు నడపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. బాంద్రా టెర్మినస్–వెలంకని స్పెషల్ ట్రైన్ (09093) ఈ నెల 27వ తేదీతో పాటు సెప్టెంబర్ 6వ తేదీన రాత్రి 9:40 గంటలకు బాంద్రా టెర్మినస్ నుంచి బయలుదేరి రెండో రోజు ఉదయం 7:40 గంటలకు వెలంకనికి చేరుకుంటుంది.
ఇతర వైపు తిరుగు ప్రయాణం కోసం వెలంకని–బాంద్రా స్పెషల్ ట్రైన్ (09094) ఈ నెల 30వ తేదీతో పాటు సెప్టెంబర్ 9న అర్ధరాత్రి 12:30 గంటలకు వెలంకనిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:30కి బాంద్రా టెర్మినస్‌కు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైలు బోరివలి, వసాయ్ రోడ్, పన్వేల్, లోనావాలా, పుణె, డౌండ్, షోలాపూర్, కలబుర్గి, వాడి, యాద్గిర్, కృష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్, తిరువన్నామలై, విల్లుపురం, మయిలాదుతురై స్టేషన్ల మీదుగా సాగుతుంది.