ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన కూలీ మూవీ హవా నడుస్తోంది. ఈ మూవీ ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది. లోకేశ్కనగరాజ్దర్శకత్వంలో ఈ మూవీ భారీ అంచనాలతో తెరకెక్కింది. ఇటీవల రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున, అమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన పాటలు ఓ ఊపు ఊపుతున్నాయి. అయితే ఇప్పుడు అందరి నోటా ఒకటే క్యారెక్టర్ గురించి వినిపిస్తోంది.
అదే కింగ్ నాగార్జున చేసిన సైమన్ పాత్ర. ఈ పాత్రలో నాగార్జున స్టైలిష్ విలన్ గా రెచ్చిపోయారు. ఓ వైపు కూల్ (Kuli) గా నవ్వుతూనే భయపెట్టేస్తున్నారు. నాగ్ కెరీర్ లో ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం. కూలీ మూవీలో నాగ్ క్యారెక్టర్ తో మూవీకి విపరీతమైన బజ్ ఏర్పడింది. అటు అమెరికాలోనూ ప్రి బూకింగ్స్ లో దూసుకెళ్తోంది కూలీ మూవీ. వార్ 2 మూవీ బుకింగ్స్ ను ఇప్పటికే దాటేసింది. దీంతో ఈ మూవీకి ఓవర్సీస్ లోనూ భారీ క్రేజ్ ఉన్న సంగతి అర్థమైతోంది. ఇక కింగ్ నాగార్జున..
ఈ మూవీలో డిఫరెంట్ గెటప్ లో విలన్ గా అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల జూన్ లో విడుదలైన కుబేర చిత్రంలో తొలిసారిగా నాగ్.. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. అయితే మూవీ చివర్లో ఆయన తన తప్పు గ్రహించి మారిపోతాడు. ఇక లేటెస్ట్ కూలీ లో మాత్రం ఏకంగా ఫుల్ లెంగ్త్ విలన్ పాత్రలో మెరిశారు నాగార్జున. అయితే ఈ క్యారక్టర్ ని నాగార్జున కంటే ముందుగా నందమూరి బాలకృష్ణ ని అడిగారట మూవీ టీమ్. కానీ బాలకృష్ణ అందుకు ససేమీరా ఒప్పుకోలేదని సమాచారం.
ముఖ్యమైన పాజిటివ్ రోల్ అయితే చేస్తాను కానీ.. ఇతర హీరోల సినిమాల్లో నెగిటివ్ రోల్ చేసే ప్రసక్తే లేదు అని ముఖం మీదనే చెప్పేశాడట. ఇక ఆ తర్వాత నాగార్జున ని సంప్రదించడం, ఆయన ఒకటికి ఆరు సార్లు కథ విని ఓకే చెప్పడం జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఆగస్టు 14 న విడుదల కానున్న ఈ మూవీ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.