Insurance Clash: టాటా ఏఐజీ షాక్..! మ్యాక్స్ హాస్పిటల్స్‌లో ఆ సర్వీసులు నిలిపివేత..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందనను సొంతం చేసుకుంటోంది. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ద్వారా లక్షలాది మహిళలు ప్రయాణ భారం నుంచి ఉపశమనం పొందుతున్నారు. శాసనమండలిలో జరిగిన చర్చలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ పథకం విజయవంతంగా కొనసాగుతున్న తీరు, ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలపై కీలక వివరాలు వెల్లడించారు. సూపర్ సిక్స్‌లో భాగంగా తీసుకొచ్చిన ఈ పథకం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతోందని, దీనివల్ల మహిళలకు ప్రతి నెలా గణనీయమైన ఆర్థిక ఆదా కలుగుతోందని మంత్రి తెలిపారు.

BSNL 4G Network: రేపు దేశవ్యాప్తంగా ప్రధాని చేతుల మీదుగా బీఎస్ఎన్ఎల్ 4 జీ సేవలు ప్రారంభం!

గతంలో సుమారు 40 శాతం మహిళలు మాత్రమే టికెట్ కొని బస్సుల్లో ప్రయాణించేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 62 శాతానికి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. రోజువారీగా 22 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. అంటే, పాత రోజుల్లో 9.7 లక్షల మహిళలతో పోలిస్తే ఇప్పుడు 20.73 లక్షలకు చేరింది. ఈ పథకం కారణంగా మహిళలకు నెలకు రూ.2,000 నుండి రూ.3,000 వరకు ఖర్చు ఆదా అవుతోందని మంత్రి వివరించారు. బస్సులలో ఆక్యుపెన్సీ కూడా 69 శాతం నుండి 90 శాతం వరకు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పథకం వార్షికంగా ప్రభుత్వంపై రూ.1,942 కోట్ల భారం మోపుతున్నప్పటికీ, ప్రజల ఆర్థిక సౌలభ్యం దృష్ట్యా ప్రభుత్వం వెనుకడుగు వేయదని మంత్రి స్పష్టం చేశారు.

BSNL: బీఎస్ఎన్ఎల్ సరికొత్త 4జీ నెట్‌వర్క్..! భారత టెలికాం రంగంలో కొత్త దశ..!

పథకం విస్తృత ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో రద్దీ రూట్లలో అదనపు ట్రిప్పులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. ప్రధాన బస్టాండ్లలో సూపర్వైజర్లు, అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారని, అందువల్ల ఎటువంటి అవాంతరాలు తలెత్తవని పేర్కొన్నారు. సెప్టెంబర్ 23 వరకు ఇప్పటికే 5.30 కోట్ల మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారని, నెలాఖరుకు ఈ సంఖ్య 7 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఇదే సమయంలో, గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన RTC ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిందని మంత్రి తెలిపారు. ప్రమోషన్లు, నైట్ ఎలవెన్సులు, బిల్లులు వంటి సమస్యలను అధికంగా పరిష్కరించామని, మిగిలిన అంశాలను కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

H-IB Visa Fee: చాలా దేశాల్లో అవసరమైనంత శ్రామిక శక్తి లేదు... మంత్రి కీలక వ్యాఖ్యలు!

మరోవైపు, బస్సుల కొనుగోలుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి వివరించారు. ఇప్పటికే 1,500 కొత్త బస్సులు కొనుగోలు చేసి డిపోలకు అందించారని, దీని కోసం రూ.600 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. అదనంగా, ఆధునాతన ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పటివరకు 750 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. వీటిని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ వంటి ప్రధాన పట్టణాల్లో నడపనున్నారు. త్వరలో మరో 1,500 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే ప్రణాళిక ఉందని తెలిపారు. దశలవారీగా పాత బస్సులను కొత్త ఎలక్ట్రిక్ బస్సులతో మార్చి, ప్రజలకు అత్యుత్తమ రవాణా సదుపాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

Ticket prices: టికెట్ రేట్లపై రగులుతున్న చర్చ.. హీరోల మధ్య మాటల వార్ మొదలవుతుందా!
Pawan kalyan: అభిమానుల ప్రార్థనలు.. అన్నయ్య త్వరగా కోలుకోవాలి.. OG విజయాన్ని ఎంజాయ్ చేయాలి.. సీఎం సందేశం!
సరికొత్త సంచలనం - 'ఓజీ' సునామీ.. కూలీ రికార్డు బ్రేక్.. టాప్ 5 ఇండియన్ సినిమాల్లో పవన్ మూవీ!
పాలిటెక్నిక్, నవోదయా స్కూల్స్ పై అసెంబ్లీలో చర్చ... త్వరలో పరిష్కారం అంటున్న లోకేష్!!
150 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి..49.9% పోస్టులు వారికి రావడం సంతోషం అంటున్నా లోకేష్!!
Godavari Floood: పెరుగుతున్న గోదావరి ఉధృతి! మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ!