రైల్వే లైన్ల విస్తరణకు శ్రీకారం! రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా 'ప్రత్యేక రైల్వే జోన్'.. రాష్ట్ర ప్రభుత్వానికి.!

గురువు లేని విద్యార్థి రాళ్లపై నడిచినట్టే విద్యార్థికి మార్గదర్శకత్వం లేకపోతే బలహీనంగా ఉంటారు అనే విషయాన్ని  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టి ఈరోజు బాలలు రేపటి పౌరులు అనే ప్రాతిపదిక అందరికి తెలిసినది. అలాంటి పౌరులను తీర్చిదిద్దే గురువుల ఉద్యోగాలో నియమించే విషయంలో నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం గొప్పదని చెప్పవచ్చు.

DSC: ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహణ! ఉద్యోగుల భవిష్యత్తుకు గ్యారెంటీ!

150 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి చేయడం ఒక చరిత్ర అని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలను పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన ఇలా ప్రసంగించారు.

Royal Enfield: మిడ్-రేంజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్! పవర్ ఫుల్ ఇంజిన్, స్టైలిష్ డిజైన్ తో రాయల్ ఎన్‌ఫీల్డ్ 350cc!

యువగణం పాదయాత్రలో నిరుద్యోగ యువతతో మాట్లాడినప్పుడు నుంచి  మెగా డీఎస్సీ ఆలోచన ప్రారంభమైందని లోకేష్ తెలిపారు. నాకు లైఫ్‌ టైమ్ గురువు మా నాన్న, సీఎం చంద్రబాబు. మిమ్మల్ని చూస్తుంటే నా టీచర్లు గుర్తొస్తారు. స్కూల్లో మంజులా మేడం కొట్టిన దెబ్బలు, రమాదేవి మేడం నేర్పిన డిసిప్లిన్‌, ఇంటర్‌లో నారాయణ మాస్టారు బృిడ్జ్ కోర్సు పాఠాలు, అమెరికాలో ప్రొఫెసర్ రాజిరెడ్డి మార్గదర్శకత్వం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రపంచంలో ఏ రంగంలో ఉన్నా ఎంత గొప్పవారైనా తమ టీచర్లను గౌరవిస్తూనే ఉంటారు అని లోకేష్ అన్నారు.

Gemini AI మ్యాజిక్! సాధారణ సెల్ఫీ నుంచి క్లాసిక్ మూవీ లుక్ వరకు...

విద్యారంగాన్ని రాజకీయాలకు అతీతంగా ఉంచేందుకు పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యార్థి మిత్ర, డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం అలాగే ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచేందుకు 9,600 స్కూల్లలో “వన్‌ క్లాస్‌-వన్‌ టీచర్” విధానాన్ని ప్రవేశపెట్టడం విద్యా సంస్థల ముఖ్యమైనదిగా తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును క్యాబినెట్ ర్యాంక్‌తో సలహాదారుగా నియమించామని పేర్కొన్నారు.

Post Office: పోస్ట్ ఆఫీస్ డిజిటల్ పాస్‌బుక్! ఫోన్‌లోనే మీ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోండి..!

అంతేకాక విద్యార్థులకు పుస్తకాల బరువు తగించి శనివారం నో బ్యాగ్‌ డే ని ఆమలుచేస్తున్నామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని, గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా డీఎస్సీలో 49.9% పోస్టులను మహిళలు పొందడం సంతోషకరమని పేర్కొన్నారు.

వృద్ధురాలి పట్ల… అమెరికా ఇంత దారుణంగా ఉందా?

నూతన ఉపాధ్యాయులు పట్టుదల, నిబద్ధతతో పనిచేయడం ద్వారా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొస్తారని  సమష్టి కృషితో ప్రభుత్వ విద్యావ్యవస్థను దేశానికి దిక్సూచిగా తీర్చిదిద్దాలని ఆయన తెలియజేయడం జరిగింది. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కలసికట్టుగా కృషిచేద్దాం. విద్య అంటే ఫిన్లాండ్, డిల్లీ మాత్రమే కాదు. ప్రపంచానికి ఆంధ్రా మోడల్ అని చూపుదాం  మంత్రి లోకేష్ యువ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

Vijayawada : ప్రత్యేక పూజలు అలంకరణలతో వెలిగిపోయిన ఇంద్రకీలాద్రి ఆలయం.. ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు!
Vande Bharat: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో మరో రెండు కొత్త వందే భారత్‌ రైళ్లు!
Flights Updates: భారీ వర్షాలు.. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు అంతరాయం.. ఫ్లైట్స్ డైవర్ట్!
Alert: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో ఉగ్రవాదాల అనుమానం! రైల్వే సిబ్బంది భారీ తనిఖీలు..!
Godavari Floood: పెరుగుతున్న గోదావరి ఉధృతి! మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ!