LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Tamil Nadu Elections 2026: నటి నయనతారపై ఎంపీ షణ్ముగం అనుచిత వ్యాఖ్యలు.. తమిళ రాజకీయాల్లో ముదిరిన వివాదం!

Tamil Nadu Elections 2026: తమిళనాడులో ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. నటి నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి.

AndhraPravasi News Desk 2 min read
Tamil Nadu Elections 2026: నటి నయనతారపై ఎంపీ షణ్ముగం అనుచిత వ్యాఖ్యలు.. తమిళ రాజకీయాల్లో ముదిరిన వివాదం!

Tamil Nadu Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే అయినా, వ్యక్తిగత దూషణలు, మహిళలను తక్కువ చేసి మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అన్నాడీఎంకే  ఎంపీ సీవీ షణ్ముగం ప్రముఖ నటి నయనతారను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి.

 అసలేం జరిగిందంటే?

తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ లేదని ఆరోపిస్తూ అన్నా డీఎంకే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. విల్లుపురంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న ఎంపీ షణ్ముగం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ వైఖరిని తప్పుబట్టారు. ఇటీవల సీఎం స్టాలిన్ ప్రజలను ఉద్దేశించి "మీ కలలను మాతో పంచుకోండి, వాటిని మేము నెరవేరుస్తాం" అని పిలుపునిచ్చారు. దీనిపై సెటైర్లు వేసే క్రమంలో ఎంపీ హద్దులు దాటారు.

కలల పేరుతో అనుచిత పోలిక

అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు, ఇప్పుడు సీఎం స్టాలిన్ కూడా కలలు కనమంటున్నారు. మరి నాకు నయనతారను కలవాలని ఉంది, నా కోరికను సీఎం తీరుస్తారా? ఎవరైనా నయనతారతో పెళ్లి చేయమని అడిగితే సీఎం చేస్తారా? అంటూ షణ్ముగం ఎద్దేవా చేశారు. మహిళా భద్రత గురించి పోరాటం చేస్తూ, అదే వేదికపై ఒక మహిళా నటిని కించపరిచేలా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మద్దతుగా నవ్విన నేతలు

ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఇతర అన్నాడీఎంకే నాయకులు ఆయన్ని వారించాల్సింది పోయి, గట్టిగా నవ్వుతూ మద్దతు తెలపడం గమనార్హం. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. "మహిళల గౌరవం కోసం నిరసన చేస్తూ, ఒక మహిళా నటి వ్యక్తిత్వాన్ని కించపరచడం ఏంటని" ప్రశ్నిస్తున్నారు.

 డీఎంకే ఘాటు స్పందన

ఎంపీ వ్యాఖ్యలపై అధికార డీఎంకే  తీవ్ర స్థాయిలో మండిపడింది. పార్టీ ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు చేయడం వేరని, కానీ ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. నయనతారపై చేసిన వ్యాఖ్యలు కేవలం ఆమె ఒక్కరినే కాకుండా, మహిళా లోకాన్ని అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు. తక్షణమే అన్నాడీఎంకే నాయకత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల వేళ ఇబ్బందికర పరిస్థితి

ఎన్నికల సమయంలో ప్రజల మద్దతు కూడగట్టాల్సిన సమయంలో ఇలాంటి వివాదాలు అన్నాడీఎంకేకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. మహిళా ఓటర్లు కీలకమైన ఈ తరుణంలో ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారాయి. ఇప్పటి వరకు ఈ వివాదంపై అటు అన్నాడీఎంకే అధిష్టానం గానీ, ఇటు నటి నయనతార గానీ అధికారికంగా స్పందించలేదు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…