ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధస్సు (AI) తన సాంకేతిక చాతుర్యంతో ప్రపంచాన్ని మోహింపజేస్తోంది. ఒకప్పుడు ఉత్తరాల నుంచి టెలిఫోన్ వరకు పరిణతమైన సాంకేతికత, ఇప్పుడు ఫోనులోనే అత్యధిక సౌకర్యాలతో కృత్రిమ మేధ అందించడం విశిష్టంగా చెప్పదగిన విషయం. నేటి చిన్నారులకు కూడా AI సుప్రచితమే. బహుశా ఏఐ తెలియని వారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరేమో అన్నట్లు ఏఐ ప్రచారం అంతగా సాగుతుంది.
రానున్న కాలంలో శ్రామిక శక్తి వినియోగం బహుశా ఉండకపోచ్చు ఎందుకంటే ఒకప్పుడు మనిషి తన చేతి రాత ద్వారా ప్రతిదీ పదిలంగా ఉంచేవాడు కానీ మనిషి స్థానం నుండి కంప్యూటర్ ఆ స్థానాన్ని పూర్తిగా తీసేసుకుందని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏఐ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం మొత్తాన్ని మనకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలంటే అలా మార్చుకునేలా సమాచారాన్ని మనకు అందిస్తుంది.
విద్యా రంగంలో ఏఐ మరింతగా విస్తరించనుంది కేవలం ఇప్పటిదాకా ఇంజనీరింగ్ కోర్సుల్లో మాత్రమే ఏఐ ని ఉపయోగించేవారు కానీ రానున్న కాలంలో ఏఐ ద్వారా పిల్లలకు పూర్తి విద్యను అందించేలా శాస్త్రవేత్తలు ఏఐ లను సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
ఔషధ రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) సైతం సైన్స్ విద్యారంగంలో తనకంటె ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తోంది. ఈ ఏడాది నుండి నాలుగేళ్ల బీ-ఫార్మసీ, ఆరేళ్ల ఫార్మ్-డీ, రెండేళ్ల ఎం-ఫార్మసీ కోర్సుల్లో సరికొత్త సిలబస్ అమలులోకి వస్తోంది. ముఖ్యంగా నూతన సాంకేతికతల (ఎమర్జింగ్ టెక్నాలజీ) సబ్జెక్టులకు ప్రాధాన్యం కేటాయించారు. దీని కింద ఏఐ, ఫైథాన్ కోడింగ్, మెషిన్ లర్నింగ్, బ్లాక్‌చైన్, రోబోటిక్స్ వంటి సబ్జెక్టులు చేర్చబడ్డాయి. అలాగే, డేటా ఆధారిత అనుభవాలు, రోగుల రికార్డుల నిర్వహణ, ఫార్మసీ ఆపరేషన్లలో ఆధునిక సాంకేతికతలు విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి వచ్చాయి.
60 సీట్ల కలిగిన కాలేజీలలో కనీసం 12 బోధకులు ఉండాలని, విద్యార్థి-అధ్యాపక నిష్పత్తి 20:1గా ఉండాలని నిర్ణయించబడింది. ఇంటర్-డిసిప్లినరీ సబ్జెక్టులుగా కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీ, డిజిటల్ హెల్త్ అనలిటిక్స్, ప్రిసీషన్ మెడిసిన్, ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, ఫోరెన్సిక్, నానో టెక్నాలజీ, న్యాయ శాస్త్రం, మేనేజ్‌మెంట్ వంటి నూతన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టారు.
మొదటి నాలుగు సెమిస్టర్లలో కోర్ సబ్జెక్టులు మరియు డిజిటల్ టెక్నాలజీ సబ్జెక్టులు మిక్సింగ్‌గా ఉండగా, తరువాతి సెమిస్టర్లలో విద్యార్థులు స్పెషలైజేషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ఔషధ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను విస్తరించడంతో, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం కలిగిన ఫార్మసీ నిపుణుల అవసరం మరింత పెరిగింది.
ఈ సిలబస్ మార్పులు ఫార్మ్-డీ, బీ-ఫార్మసీ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను గణనీయంగా విస్తరించనున్నాయి, వారి వ్యాపార మరియు పరిశోధనా నైపుణ్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన స్థాయికి తీసుకెళ్తాయి.