ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెజాన్ సంస్థ గిఫ్ట్ కార్డుల పేరిట ప్రజల సొమ్ము దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన తన సిబ్బంది సైతం ఈ దోపిడీకి గురయ్యారని అన్నారు. ఒక సంవత్సరం గడువుతో కస్టమర్లకు గిఫ్ట్ కార్డులు ఇచ్చిన అమెజాన్.. గడువు తీరాక కస్టమర్లు గిఫ్ట్ కార్డులు వాడుకునే వీలు లేకుండా డార్మాంట్ అకౌంట్స్ కి కన్వర్ట్ చేసిందని మండిపడ్డారు పవన్. 295 మిలియన్ మందికి పైగా ఈ కామర్స్ యూజర్లు ఉన్న ఇండియాలో సుమారు ఒక మిలియన్ కి పైగా యూజర్లు అమెజాన్ గిఫ్ట్ కార్డులు కొన్నారని అన్నారు పవన్.
ఇంకా చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! విశాఖలో డిజైన్ కేంద్రం.. గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు!
ఆర్బీఐ ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం.. పీపీఐలు కనీసం ఒక ఏడాది గడువుతో ఉండాలని.. గడువు తీరాక ఇనాక్టివ్ గా ఉన్న అకౌంట్లను కస్టమర్లకు ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతనే డీయాక్టివేట్ చేయాలని అన్నారు పవన్. అకౌంట్ డీయాక్టివేట్ చేసాక సదరు సొమ్మును కస్టమర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్న ఆర్బీఐ నిబంధనను గుర్తు చేసిన పవన్.. ఈ కామర్స్ సంస్థలు ఇలాంటి అంశాల్లో పారదర్శకత పాటించాలని అన్నారు. కస్టమర్లను అనవసర నష్టాల నుంచి రక్షించాలని ఈ కామర్స్ సంస్థలను ట్వీట్ ద్వారా కోరారు పవన్ కళ్యాణ్.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వారసత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు! జగన్ మళ్లీ సీఎం అయితే? దావోస్ లో చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఆయన నియామకానికి రంగం సిద్ధం! సీనియారిటీ జాబితాలో రెండో స్థానం!
ఓరి దేవుడా.. వీడు అసలు మనిషేనా? ఘోరం... భార్యను చంపి కుక్కర్ లో ఉడికించాడు!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! విశాఖలో డిజైన్ కేంద్రం.. గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు!
ఘోర ప్రమాదం... ప్రయాణికుల మీదకు దూసుకెళ్లిన రైలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: