ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం హామీల్లో భాగంగా కర్ణాకట, తెలంగాణ తరహాలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయడానికి తాజాగా తేదీని ప్రకటించారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్కీమ్ అమలుకు ఆగస్టు 15 నుంచి శ్రీకారం చుట్టనుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కర్ణాటకలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేయగా.. తెలంగాణలో మాత్రం జీరో టికెట్ల విధానం అనుసరిస్తున్నారు. అలాగే గుర్తింపు కార్డులు చూసి జీరో టికెట్లు ఇస్తున్నారు. ఈ టికెట్ల ఆధారంగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లింపులు జరుపుతోంది. 

ఇవి కూడా చదవండి 

టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు!

అమరావతి వాసులకు గుడ్ న్యూస్! త్వరలోనే కార్యకలాపాలు మొదలుపెట్టనున్న 3 సంస్థలు! 

కోడికత్తి కేసులో మరో బిగ్ ట్విస్ట్! ఎన్ఐఏ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు! 

విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు రావాల్సిందే! మదన్ మోహన్ షాకింగ్ కామెంట్స్! 

ఆ విషయం సీఎం చంద్రబాబును ఎలా అడగాలో తెలియడంలేదు! డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు! 

అనంత్ అంబానీ పెళ్ళిలో ఆ విషయం పైనే చర్చ! జనసేనాని ఏం చెప్పారంటే! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group