ఏపీలో రైలు ప్రయాణికులకు అధికారులు శుభవార్త చెప్పారు. ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని.. మొత్తం 12 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రెండు అదనపు జనరల్ బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్ గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్‌ప్రెస్ (12709/12710).. సికింద్రాబాద్ హౌరా మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (12703/12704) రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విశాఖపట్నం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ (12727) కు కూడా అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. కాకినాడ పోర్ట్ నుంచి లింగంపల్లికి వచ్చే గౌతమి ఎక్స్‌ప్రెస్ (12737/12738).. కాకినాడ పోర్టు నుంచి భావనగర్ వెళ్లే రైలు (12755/12756)కు, కాకినాడ పోర్ట్ నుంచి సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ (17205/17206) , హైదరాబాద్ నుంచి తాంబరం వెళ్లే ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్ (12759/12760), కాకినాడ పోర్ట్ నుంచి లింగంపల్లి వచ్చే రైలు (12775/12776), సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ (17015/17016), మచిలీపట్నం నుంచి యశ్వంత్‌పూర్ కొండవీడు ఎక్స్‌ప్రెస్ (17211/17212), మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్లే మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17215/17216), కాకినాడ పోర్ట్ నుంచి లోకమాన్య తిలక్ (17221/17222) రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సికింద్రాబాద్ డివిజన్‌లో నిర్వహణ పనుల కారణంగా ఇటీవల విజయవాడ- భద్రాచలం రోడ్ మధ్య నడిచే 07278/07279 నంబరు రైలును రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రైలును శనివారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
ఇంకా చదవండి: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వందేభారత్ స్లీపర్ తొలి రైలు ఈ రూట్‌లోనే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన మంత్రులు! ఎందుకో తెలుసా?
ఈ దేశాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఆదాయం ఎంతున్నా ఎవరూ అడగరు! ఆహా ఎంత అదృష్టమో!
కువైట్ ఎడారిలో ఒక తెలుగు ప్రవాసుడి ఆవేదన! ఎవరూ స్పందించకపోతే ఆత్మహత్యే దిక్కు!
చాక్లెట్ ఇప్పిస్తానాని, చిన్నారిపై లైంగిక దాడి ! వైద్యులు ఏం చెప్పారంటే!
అది శంకర్ 'భారతీయుడు' .. మరి ఇది? పబ్లిక్ టాక్! నిన్ననే థియేటర్లలో విడుదలైన సినిమా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: