Major SPS Oberoi: త్రిమూర్తులు స్కెచ్ వేస్తే అట్లుంటది మరి... ఆర్మీ ఆఫీసర్ వెల్లడించిన షాకింగ్ ఫ్యాక్ట్స్!

Major SPS Oberoi: మాజీ మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ భారత సరిహద్దు భద్రత, చైనాతో ఎల్‌ఏసీ ఒప్పందాలు, ఇందిరా గాంధీ చారిత్రక నిర్ణయాలు మరియు పిఓకే స్వాధీనంపై సంచలన విశ్లేషణ చేశారు. అజిత్ దోవల్, అమిత్ షా, జైశంకర్ త్రిమూర్తుల వ్యూహాలతో భారతదేశ దౌత్యం, అంతర్గత భద్రత అత్యంత పటిష్టంగా మారిందని ఆయన కొనియాడారు.

Major SPS Oberoi: త్రిమూర్తులు స్కెచ్ వేస్తే అట్లుంటది మరి...
  • చికెన్స్ నెక్‌పై చైనా కన్ను పడితే ఏం జరుగుతుంది? సిక్కిం విలీనం వెనుక ఇందిరా గాంధీ మాస్టర్ మైండ్!

  • బంగ్లాదేశ్ సరిహద్దుల్లో డిజిటల్ ఫెన్సింగ్ ప్రాజెక్ట్! అక్రమ ప్రవేశాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం వేసిన లేటెస్ట్ స్కెచ్!

  • పి.వి. నరసింహారావు - మన్మోహన్ సింగ్ జోడీ 1991లో చేసిన మ్యాజిక్ ఏంటి? భారత్ ఆర్థిక వ్యవస్థను కాపాడిన ఆ నిర్ణయాలు!

Major SPS Oberoi: బంగ్లాదేశ్ సరిహద్దు భద్రత మరియు అక్రమ ఊరబాటల నిరోధంపై ఒబెరాయ్ మాట్లాడుతూ, ప్రస్తుతం డిజిటల్ ఫెన్సింగ్, డ్రోన్లు, శాటిలైట్ సర్వైలెన్స్ మరియు బీఎస్ఎఫ్ (BSF) పగడ్బందీ నిఘా ద్వారా సరిహద్దులను అప్రమత్తం చేశామని చెప్పారు. బంగ్లాదేశ్ ఆర్థికంగా బలహీనపడటంతో పాటు దౌత్యపరంగా ఒంటరికావడంతో భారత్‌పై నేరుగా యుద్ధానికి దిగే సాహసం చేయలేదని స్పష్టం చేశారు. అయితే అక్కడ మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులు తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన అని, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఆ దేశానికి అందే నిధులపై ఇది ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

చైనా, పాకిస్తాన్ సరిహద్దు వ్యూహాల వ్యత్యాసాన్ని వివరిస్తూ.. పాకిస్తాన్ కంటే చైనానే భారత్‌కు అత్యంత ప్రమాదకరమైన శత్రువని అభిప్రాయపడ్డారు. 1962 ఒప్పందం మేరకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద ఆయుధాలు లేకుండా ముఖాముఖి ఘర్షణలను అదుపు చేస్తున్నామని, సాయుధ బలగాలు, పొలిటికల్ విల్ మరియు దౌత్యనీతి సరిగ్గా ఉంటే ఏ శత్రువునైనా నిలువరించవచ్చని చెప్పారు. 1975లో సిక్కింను భారత్‌లో విలీనం చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం చికెన్స్ నెక్ (చోక్ పాయింట్) ప్రాంతాన్ని చైనా నుండి కాపాడుకోవడమేనని గుర్తుచేశారు.

భారత రాజకీయ చరిత్రలో ఇందిరా గాంధీ మరియు పి.వి. నరసింహారావు అత్యంత సాహసోపేతమైన, సుదూర విజన్ ఉన్న ప్రధానులని ఆయన అభివర్ణించారు. 1971లో పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయడం, సిక్కిం విలీనం, 'రా' (RAW) ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు ఇందిరా గాంధీ బోల్డ్ లీడర్‌షిప్‌కు నిదర్శనమన్నారు. అయితే పంజాబ్‌లో స్థానిక రాజకీయం కోసం జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేకు అపరిమిత శక్తులు ఇవ్వడం, ఐబీ హెచ్చరికలను పక్కనబెట్టి పర్సనల్ గన్‌మెన్లను నమ్మడం వల్ల ఆపరేషన్ బ్లూస్టార్ మరియు తదనంతరం ఆమె హత్య జరిగాయని విశ్లేషించారు. అలాగే 1991లో పి.వి. నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్, ఆర్‌బీఐ గవర్నర్ రంగరాజన్ టీమ్‌వర్క్ వల్ల దేశం ఆర్థిక రంగాన బలపడిందని చెప్పారు.

ఖలిస్తాన్ ఉద్యమం మరియు సిక్కు కమ్యూనిటీ గురించి ప్రస్తావిస్తూ.. 1962 చైనా యుద్ధ సమయంలో దేశం మొత్తం 257 కేజీల బంగారం సేకరిస్తే, ఒక్క పంజాబ్ రాష్ట్రం నుంచే 252 కేజీల బంగారం అందిందని, పంజాబీలకు దేశంపై ఉన్న ప్రేమకు ఇది ప్రతీక అని చెప్పారు. ఖలిస్తాన్ అనేది ఒక వర్గం తెచ్చిన పొలిటికల్ డిసిజన్ మాత్రమే తప్ప, దానికి మాస్ సపోర్ట్ లేదని స్పష్టం చేశారు. అలాగే శ్రీలంకలో ఎల్టీటీఈ (LTTE) ఆవిర్భావం వెనుక ఇందిరా గాంధీ హస్తం ఉందని, పాకిస్తాన్ నౌకలకు శ్రీలంక ఇంధనం అందించినందుకు గుణపాఠంగా ఎల్టీటీఈ పురుడు పోసుకుందని, అయితే తదనంతరం అదే శ్రీలంకను, రాజీవ్ గాంధీ ప్రాణాలను బలితీసుకుందని ప్రకృతి ప్రతికారాన్ని వివరించారు.

రాబోయే రోజుల్లో పిఓకే (PoK - పాక్ ఆక్రమిత కాశ్మీర్) పునరుద్ధరణ మరియు బలూచిస్తాన్ విడిపోవడంపై భారతదేశం అత్యంత జాగ్రత్తగా వ్యూహాలు రచించాలన్నారు. పిఓకేను స్వాధీనం చేసుకున్న తర్వాత కనీసం 3 నుండి 4 దశాబ్దాల పాటు 'కంట్రోల్డ్ టెర్రిటరీ'గా ఉంచి, అక్కడి తీవ్రవాద భావజాలాన్ని నిర్మూలించిన తర్వాత మాత్రమే భారత్‌లో పూర్తిస్థాయిలో విలీనం చేయాలని ఒబెరాయ్ సూచించారు.

Be the first to react

Latest