LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
National

India Climate Goals: పర్యావరణ పరిరక్షణలో భారత్ కీలక నిర్ణయం.. 2035 నాటికి 47 శాతం కాలుష్య తగ్గింపు లక్ష్యం!

Political: భారతదేశం తన కొత్త పర్యావరణ లక్ష్యాలను (NDC) ప్రకటించింది. 2035 నాటికి ఉద్గారాల తీవ్రతను 47% తగ్గించాలని, మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 60% పునరుత్పాదక ఇంధనం ద్వారా సాధించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2070 నాటికి నెట్-జీరో సాధించే దిశగా ఈ నిర్ణయం ఒక కీలక మైలురాయ…

AndhraPravasi News Desk 2 min read
India Climate Goals: పర్యావరణ పరిరక్షణలో భారత్ కీలక నిర్ణయం.. 2035 నాటికి 47 శాతం కాలుష్య తగ్గింపు లక్ష్యం!

Viksit Bharat 2047 Climate: భారతదేశం వాతావరణ మార్పులపై  మరింత ఉధృతం చేస్తూ సరికొత్త లక్ష్యాలను ప్రకటించింది. 2035 నాటికి ఉద్గారాలను భారీగా తగ్గించడంతో పాటు, పునరుత్పాదక ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక ఆమోదం తెలిపింది.

పర్యావరణ పరిరక్షణలో భారత్ కొత్త అడుగు

ప్రపంచ దేశాల మధ్య కుదిరిన పారిస్ ఒప్పందం ప్రకారం, ప్రతి ఐదేళ్లకోసారి దేశాలు తమ పర్యావరణ లక్ష్యాలను  పునఃసమీక్షించుకోవాలి. ఇందులో భాగంగా భారత్ తన పాత లక్ష్యాలను మరింత కఠినతరం చేస్తూ కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. రాబోయే పదేళ్లలో దేశం అనుసరించబోయే వ్యూహాలివే.

ఉద్గారాల తగ్గింపు

2035 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP) ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయి కంటే 47 శాతం తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే పరిశ్రమలు, రవాణా రంగాల నుండి వెలువడే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం.

పునరుత్పాదక ఇంధనం 

విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, 60 శాతం విద్యుత్తును సౌర, పవన  ఇతర పర్యావరణ అనుకూల మార్గాల ద్వారానే పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కార్బన్ సింక్ 

వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకునేందుకు అడవుల విస్తీర్ణం పెంచాలని భారత్ భావిస్తోంది. 2035 నాటికి దాదాపు 3.5 నుండి 4.0 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించగలిగేలా చెట్లను పెంచడం ఈ ప్రణాళికలో మరో ముఖ్య భాగం.

గత విజయాల స్ఫూర్తితో..

భారతదేశం గతంలో పెట్టుకున్న లక్ష్యాలను గడువు కంటే ముందే పూర్తి చేయడం గమనార్హం. 2005 నుండి 2020 మధ్య కాలంలోనే ఉద్గారాల తీవ్రతను 36 శాతం మేర తగ్గించగలిగింది. అలాగే, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 52 శాతం శిలాజ రహిత వనరుల నుండే వస్తోంది. కేంద్ర మంత్రివర్గం ఈ కొత్త లక్ష్యాలను కేవలం ఆశయాలుగా కాకుండా, కచ్చితంగా అమలు చేయగల వాస్తవ ప్రణాళికలుగా అభివర్ణించింది.

ఈ లక్ష్యాలను సాధించడానికి గ్రీన్  హైడ్రోజన్ఉ త్పత్తి, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్  పర్యావరణ అనుకూల పారిశ్రామిక పద్ధతులను ప్రోత్సహించనున్నారు. అంతర్జాతీయ సౌర కూటమి వంటి సంస్థల భాగస్వామ్యంతో భారతదేశం ఈ గ్లోబల్ వార్మింగ్ పోరాటంలో అగ్రగామిగా నిలవాలని చూస్తోంది. 2070 నాటికి 'నెట్ జీరో'  సాధించాలనే భారతదేశ దీర్ఘకాలిక కల దిశగా ఇదొక అతిపెద్ద ముందడుగు అని నిపుణులు భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శ…

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందన్న వా…

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినే…