LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
National

Ocean Plastic: సముద్రాల్లో ప్లాస్టిక్‌కు చెక్! వైరల్ వీడియో వెనుక నిజమైన పురోగతి!

Ocean Plastic Vacuum: సముద్రాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే భారీ యంత్రం. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. 2040 నాటికి సముద్రాల్లో ఉన్న ప్లాస్టిక్‌లో 90 శాతం వరకు తొలగించడమే లక్ష్యం.

AndhraPravasi News Desk 2 min read
Ocean Plastic: సముద్రాల్లో ప్లాస్టిక్‌కు చెక్! వైరల్ వీడియో వెనుక నిజమైన పురోగతి!

సోషల్ మీడియాలో వీడియో వైరల్..

600 మీటర్ల భారీ వ్యవస్థ.. 

2040 నాటికి సముద్రాల్లో ఉన్న ప్లాస్టిక్‌లో 90 శాతం తొలగించడమే లక్ష్యం.. 

సముద్రాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే భారీ యంత్రం వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ వీడియో 2022లో విడుదలైనదే అయినప్పటికీ, తాజాగా మళ్లీ ప్రాచుర్యం పొందింది. ఈ వీడియోలో సముద్రంపై తేలుతూ భారీగా ప్లాస్టిక్‌ను సేకరించే ప్రత్యేక వ్యవస్థ కనిపించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

600 మీటర్ల భారీ వ్యవస్థ 
ఈ సాంకేతికతను ది ఓషన్ క్లీనప్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. సుమారు 600 మీటర్ల పొడవు ఉన్న ఈ నీటిపై తేలే నిర్మాణం సముద్రపు అలలను ఉపయోగించి ప్లాస్టిక్‌ను ఒకచోటికి చేరుస్తుంది. ముఖ్యంగా గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ పాచ్ వంటి ప్రపంచంలోనే అతిపెద్ద చెత్త ప్రాంతాల్లో ఇది ఉపయోగిస్తున్నారు.

2040 లక్ష్యం 
ఈ ప్రాజెక్ట్ లక్ష్యం 2040 నాటికి సముద్రాల్లో ఉన్న ప్లాస్టిక్‌లో 90 శాతం వరకు తొలగించడం. వైరల్ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ, సముద్ర జీవవ్యవస్థను కాపాడేందుకు ఇది కీలక అడుగని అభిప్రాయపడ్డారు. అయితే కొందరు ప్రాజెక్ట్ పురోగతిపై సందేహాలు కూడా వ్యక్తం చేశారు.

ప్రాజెక్ట్‌లో తాజా పురోగతి 
సోషల్ మీడియాలో ఒక యూజర్ ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితిపై ప్రశ్నించగా, తాజా వివరాలు బయటపడ్డాయి. 2022లో ఉన్న System 002 నుంచి ఇప్పుడు మరింత అభివృద్ధి చెందిన System 03 దశకు ప్రాజెక్ట్ చేరింది. ప్రస్తుతం ఇది గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ పాచ్‌లో సమర్థంగా పనిచేస్తోంది.

2025 జూన్ నాటికి సముద్రాల నుంచి సుమారు 5 లక్షల కిలోల ప్లాస్టిక్‌ను తొలగించారు. ఇది ప్రాజెక్ట్‌లో ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

నదుల్లో కూడా  
ఈ సంస్థ సముద్రాలతో పాటు నదుల్లో కూడా ప్లాస్టిక్ తొలగింపు చర్యలు చేపడుతోంది. 20కి పైగా “ఇంటర్‌సెప్టర్స్” ద్వారా 2025లోనే 2.5 కోట్ల కిలోలకుపైగా వ్యర్థాలను తొలగించారు. అదే ఏడాది చివరికి ఈ మొత్తం 4.5 కోట్ల కిలోలకు చేరగా, 2026 జనవరి నాటికి ఇది 5 కోట్ల కిలోలను దాటింది.

30 నగరాల ప్రణాళిక 
2025లో సంస్థ “30 Cities Program” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని లక్ష్యం నదుల ద్వారా సముద్రాల్లోకి వెళ్లే ప్లాస్టిక్‌ను 2030 నాటికి మూడో వంతు వరకు తగ్గించడం.

ప్రస్తుతం సాధించిన పురోగతితో ప్రాజెక్ట్ సరైన దిశలో సాగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా మరింత విస్తరణ జరిగితే, భవిష్యత్తులో సముద్రాల్లో ప్లాస్టిక్ సమస్యను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని వారు వెల్లడిస్తున్నాడు.

ఒకప్పుడు కేవలం వైరల్ వీడియోగా కనిపించిన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు వాస్తవంగా ఫలితాలు ఇస్తోంది. ప్రకృతిని కాపాడాలంటే సాంకేతికతను ఎలా ఉపయోగించాలో ఈ ప్రయత్నం చూపిస్తోంది. సముద్రాలు శుభ్రంగా ఉండాలంటే ఇలాంటి ప్రయత్నాలు మరింత పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

Be the first to react

More Coverage

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శ…

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందన్న వా…

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినే…