BRICS దెబ్బకు ఓనికి పోతున్న అమెరికా యూరోప్ జి 7 దేశాలు! ఇక డాలర్ పతనమే!

అంతర్జాతీయ రాజకీయాలు, గ్లోబల్ ఎకానమీలో ఇప్పుడు సరికొత్త మార్పులు ప్రారంభమయ్యాయి. ఇటీవల జరిగిన బ్రిక్స్ (BRICS) సమ్మిట్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియన్ కలిసి కనిపించిన ఫోటో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

BRICS దెబ్బకు ఓనికి పోతున్న అమెరికా యూరోప్ జి 7 దేశాలు! ఇక డాలర్ పతనమే!
BRICS దెబ్బకు ఓనికి పోతున్న అమెరికా యూరోప్ జి 7 దేశాలు! ఇక డాలర్ పతనమే!
  • రష్యా తయారు చేసిన 105 విమానాలు భారత్‌కే: పాశ్చాత్య ఆంక్షల వేళ కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం!

  • National: G7 కంటే బలపడుతున్న బ్రిక్స్ కూటమి: ప్రపంచ జీడీపీలో 40 శాతానికి చేరిన వాటా!

America: అంతర్జాతీయ రాజకీయాలు, గ్లోబల్ ఎకానమీలో ఇప్పుడు సరికొత్త మార్పులు ప్రారంభమయ్యాయి. ఇటీవల జరిగిన బ్రిక్స్ (BRICS) సమ్మిట్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియన్ కలిసి కనిపించిన ఫోటో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, మరోవైపు రష్యా, ఇరాన్‌లతో వ్యూహాత్మక బంధాన్ని కాపాడుకోవడం భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానానికి అద్దం పడుతోంది.

భారత్ – రష్యా ద్వైపాక్షిక ఒప్పందాలు, విమానయాన రంగంలో కీలక ముందడుగు..
సమ్మిట్ ప్రారంభానికి ముందే ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య దాదాపు 40 నిమిషాల పాటు ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. 2030 సంవత్సరం నాటికి ఇంధనం, సాంకేతికత, రక్షణ, మౌలిక వసతులు మరియు సాంస్కృతిక రంగాల్లో ఆర్థిక సహకారాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా తమిళ ప్రముఖ సాహిత్యం 'తిరుక్కురళ్' రష్యన్ అనువాద ప్రతిని పుతిన్‌కు మోడీ బహుమతిగా ఇచ్చారు.

ఈ భేటీలో సివిల్ ఏవియేషన్ రంగానికి సంబంధించి ఒక ప్రధాన నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రాంతీయ అనుసంధానత పథకం 'ఉడాన్' కోసం రష్యాకు చెందిన 105 ఐఎల్-114-300 ప్యాసింజర్ విమానాలను కొనుగోలు చేసే దిశగా ఒప్పందం కుదిరింది. ఇందులో 50 విమానాలను పినాకిల్ ఎయిర్, 20 విమానాలను ఎయిర్ కేరళ, 35 విమానాలను స్లీక్ ఏవియేషన్ తీసుకోనున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు 3,000 కంటే ఎక్కువ ఆంక్షలు విధించడంతో, బోయింగ్ స్పేర్ పార్ట్స్ కొరతను తట్టుకునేందుకు రష్యా తన యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ద్వారా స్వదేశీ సాంకేతికతతో ఆంక్షలు తట్టుకునే విమానాలను తయారు చేసింది.

G7 వర్సెస్ BRICS: మారిన ఆర్థిక సమీకరణాలు..
ప్రపంచ ఆర్థిక వేదికపై G7 కూటమి కంటే బ్రిక్స్ బలంగా ఎదుగుతోంది. ప్రపంచ మొత్తం జీడీపీలో G7 దేశాల వాటా కేవలం 29% మాత్రమే ఉండగా, బ్రిక్స్ దేశాల వాటా దాదాపు 40%కి చేరుకుంది. అలాగే ప్రపంచ జనాభాలో G7 వాటా 10% కాగా, బ్రిక్స్ దేశాలు ఏకంగా 50% జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వెస్టర్న్ ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ చమురు దిగుమతుల్లో దాదాపు 50% రష్యా నుంచే వస్తుండటం విశేషం.

'బ్రిక్స్ పే' మరియు ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ..
అంతర్జాతీయ వ్యాపారంలో డాలర్ ఆధిపత్యాన్ని, షిఫ్ట్ (SWIFT) నెట్‌వర్క్ పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు బ్రిక్స్ దేశాలు కృషి చేస్తున్నాయి. డాలర్‌ను పూర్తిగా నిషేధించకుండా, సభ్య దేశాలు తమ జాతీయ కరెన్సీల్లో (రూపాయి - రూబుల్) వ్యాపార చెల్లింపులు చేసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇండియాలో యూపీఐ లాగే బ్రిక్స్ దేశాల మధ్య చెల్లింపుల కోసం 'బ్రిక్స్ పే' డిజిటల్ వ్యవస్థపై చర్చలు వేగవంతమయ్యాయి. ఇదే సమయంలో, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్‌లకు ప్రత్యామ్నాయంగా చైనాలో ఉన్న 'న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్' (NDB) నిధులను పెంచాలని, సముద్ర రవాణా భద్రత కోసం సొంత రీ-ఇన్సూరెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇరాన్ అధ్యక్షుడు ప్రతిపాదించారు. సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా తమ వద్ద ఉన్న 3.5 ట్రిలియన్ డాలర్ల ఖనిజ సంపదలో పెట్టుబడులు పెట్టాలని కోరగా, ఇది భారత్ యొక్క 'మేక్ ఇన్ ఇండియా' ఆలోచనకు సరిపోలుతోంది. ప్రధాని మోడీ కూడా ప్రయాణ మార్గాలైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వంటి సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండాలని స్పష్టం చేశారు.

మొత్తానికి, బ్రిక్స్ కూటమి డాలర్‌కు ప్రత్యామ్నాయ పేమెంట్ సిస్టమ్స్ మరియు గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ దిశగా అడుగులు వేస్తోంది. భారత్ ఏ ఒక్క కూటమి వైపు మొగ్గు చూపకుండా, తన జాతీయ ప్రయోజనాలే పరమావధిగా దౌత్య నీతిని కొనసాగిస్తోంది.

Tags

Be the first to react

Latest