తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్! Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక! Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు! 1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి! 5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.! Labubu: ది మాన్స్టర్స్ సిరీస్‌లో భాగమైన లబుబు.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షనర్స్‌ క్రేజ్‌! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్! Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక! Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు! 1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి! 5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.! Labubu: ది మాన్స్టర్స్ సిరీస్‌లో భాగమైన లబుబు.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షనర్స్‌ క్రేజ్‌!

Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53!

2025-11-06 20:21:00

ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 53వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో

శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి

53. ఓం గుణాతీత స్థితి ప్రదాయై నమః

అర్థం: క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానం గుణాతీత స్థితికి దారితీస్తుంది. శ్రీమద్భగవద్గీత, 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగంలో త్రిగుణాలను గురించి, త్రిగుణాలకు అతీతమైన స్థితి గురించి తెలియజేయబడింది.

సత్త్వం రజస్తమ ఇతి 
 గుణాః ప్రకృతిసంభవాః । 
నిబధ్నంతి మహాబాహో 
 దేహే దేహినమవ్యయమ్‌ ॥ 14.5

ప్రకృతి వలన పుట్టిన సత్త్వ, రజో, తమో గుణాలు దేహిని దేహమునందు బంధిస్తున్నాయి. దేహి (దేహంలోని ఆత్మ) నాశనం లేనివాడు, నిత్యుడు.

సత్త్వగుణం నిర్మలమైనది, ప్రకాశవంతమైనది, ఉపద్రవం లేనిది. అది సుఖం పట్ల ఆసక్తి చేత, జ్ఞానం పట్ల ఆసక్తిచేత జీవుడిని బంధిస్తుంది.

రజోగుణం దృశ్య విషయాలపై ప్రీతిని కలుగజేస్తుంది. కోరికను, ఆసక్తిని కలుగజేస్తుంది. అది కర్మములందలి ఆసక్తిచేత ఆత్మను బంధిస్తుంది.

తమోగుణం అజ్ఞానం నుండి పుట్టింది. అది మోహం కలుగజేస్తుంది. అది మరపు, పరాకు, సోమరితనము, అతినిద్ర మొదలగు వాటిచేత ఆత్మను బంధిస్తుంది. మొత్తం మీద ఈ మూడు గుణాలూ బంధ హేతువులే.

సాత్త్విక కర్మలకు ఫలం నిర్మలమైన సుఖం. రాజస కర్మలకు ఫలం దుఃఖం. తామస కర్మలకు ఫలం అజ్ఞానం. జీవుడు దేహోత్పత్తికి / జన్మ పరంపరకు కారణాలైన ఈ మూడు గుణాలను దాటినప్పుడు దుఃఖం, వృద్ధాప్యం, చావు పుట్టుకలు అనే వాటినుండి విముక్తుడై మోక్షాన్ని పొందుతున్నాడని భగవద్గీత చెపుతుంది.

త్రిగుణాలలో పడిపోయి నా స్వభావాన్ని కోల్పోయిన నాకు గుణాతీతస్థితిని ప్రసాదించిన నా తల్లి గీతామాతకు ధన్యవాదంతో నమస్కరిస్తున్నాను.

ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు

https://t.me/jaibhavaghni

లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ

జై గురుదేవ్

నామం 52: Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52!

నామం 51: Bhagavad Gita: అనన్యభక్తి సారాంశం.. భగవంతునియందు నిశ్చల విశ్వాసం, నిరంతర ధ్యానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -51! 

నామం 50: Bhagavad Gita: నేను దేహం కాదని తెలిపే పరమజ్ఞానమే నిజమైన ఆత్మసాక్షాత్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -50! 

నామం 49: Bhagavad Gita: అపరా భక్తి మనసును స్థిరం చేస్తుంది, పరా భక్తి మనసును మోక్షానికి తీసుకెళ్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -49!

నామం 48: Bhagavad Gita: లౌకిక కార్యాలు కాదు.. ఆత్మజ్ఞానమే అసలైన సిద్ధి... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -48!

నామం 47: Bhagavad Gita: అవివేకాన్ని చెరిపి ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం చేసే గీతామాతకు నమస్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -47!

నామం 46: Bhagavad Gita: శ్రీకృష్ణుని నోటివెంట జాలువారిన గీతామృతం.. మానవునికి మోక్ష మార్గం చూపే జ్ఞానరసాయనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -46!

నామం 45: Bhagavad Gita: అమంగళం శాంతించు గాక... గీతా తత్వం జీవన సత్యంగా మారాలంటే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -45!

నామం 44: Bhagavad Gita: హితకరమైన కోరికలతో జీవిస్తే ఫలితం తప్పదు.. గీతా సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -44!

నామం 43 : Bhagavad Gita: తామరాకును నీరు అంటక.. గీతాధ్యానం చేసేవారికి పాపం తగదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -43!

నామం 42 : Bhagavad Gita: ధర్మం మనలో ఉండాలి.. భగవద్గీతలోని సనాతన సూత్రాల సారాంశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -42!

నామం 41 : Bhagavad Gita: జననం మరణం అనివార్యం.. ఇది తెలిసినవాడు శోకించడు... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -41!

నామం 40 : Bhagavad Gita: అహం బ్రహ్మాస్మి.. మనిషి నుంచి పరమాత్మ వైపు ఆత్మయాత్ర.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 40!

నామం 39 : Bhagavad Gita: సంప్రదాయాలే ఆచారం.. శాస్త్ర విహిత కర్మాచరణ ద్వారానే మోక్ష సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -39!

నామం 38 : Bhagavad Gita : మంచినే చూడండి మంచినే వినండి.. అన్నిటిలో నేనే ఉన్నాను.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -38!

నామం 37 : Bhagavad Gita : ప్రేమలో ద్వేషానికి చోటు లేదు.. మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -37!

నామం 36 : Bhagavad Gita :సుఖం ఉన్నంత మాత్రాన శాంతి ఉండదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -36!

నామం 35 : Bhagavad Gita : బాహ్య సుఖం తాత్కాలికం ఆత్మసుఖమే నిత్యమైనది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -35!

నామం 34 : Bhagavad Gita : మరణ భయమే గొప్పది, కానీ జీవుడు దేహం కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -34!

నామం 33 : Bhagavad Gita : మనసులో శాంతి, మాటల్లో మృదుత్వం, కష్టాల్లో ఓర్పు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -33!

నామం 32 : Bhagavad Gita: సంసార మహాసాగరంలో విజయ మార్గం చూపే గీతామాత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -32! 

నామం 31 : Bhagavad Gita: వైరాగ్యం అంటే రాగరహిత స్థితి.. దుఃఖానికి దూరమైన ఆత్మశాంతి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా31!

నామం 30 : Bhagavad Gita: కర్మ చేయడమే నీ అధికారం.. ఫలానికి కాదు.. గీతా బోధ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -30!

Spotlight

Read More →