ఈ రోజుల్లో మోకాళ్లు, కీళ్ల నొప్పులు (Joint pains) వృద్ధులకే కాదు యువతకూ సాధారణ సమస్యగా మారుతున్నాయి. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, వ్యాయామం లేకపోవడం, పోషకాహారం లోపించడం వంటి అలవాట్లు చిన్న వయసులోనే కీళ్ల సమస్యలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ నొప్పులు మరింత ఎక్కువగా ఇబ్బంది పెడతాయి.
చాలా మందికి కీళ్ల వాతం సమస్య ఉంది. దీనిని ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటారు. ఈ సమస్య ఉన్నవారికి కీళ్లలో నొప్పి, వాపు, గట్టితనం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వయస్సుతో సంబంధం లేకుండా శారీరక చలనం తగ్గిపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
కీళ్ల వాతం కారణంగా నొప్పి భరించలేనంతగా ఉండడంతో చాలామంది పెయిన్ కిల్లర్ మందులపై ఆధారపడుతున్నారు. ఇవి తక్షణ ఉపశమనం ఇచ్చినా, దీర్ఘకాలంలో ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. అందుకే సహజమైన మార్గాల్లో నొప్పిని తగ్గించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఆయుర్వేద పోషకాహార నిపుణురాలు శ్వేతా షా ఓ సులభమైన సహజ చిట్కాను సూచించారు. ఆమె తన సోషల్ మీడియా ద్వారా ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద పొట్లీ నివారణ గురించి వివరించారు. ఈ పొట్లీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుని, నొప్పి ఉన్న చోట వేడి కంప్రెస్‌లా ఉపయోగించవచ్చని చెప్పారు.
ఈ ఆయుర్వేద (Natural remedie) కొన్ని సాధారణ సుగంధ ద్రవ్యాలు, మూలికలతో తయారు చేస్తారు. ఇవి కీళ్లలో నొప్పి, వాపు, గట్టితనాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఇందులో ఎలాంటి రసాయనాలు లేకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సహజంగా, భద్రంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఇది మంచి మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు.