హైదరాబాద్‌లో నటుడు విజయ్ దేవరకొండపై సీఐడీ సిట్ విచారణ ముగిసింది. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన అంశంపై ఆయనను అధికారులు గంటకు పైగా ప్రశ్నించారు. ఈ విచారణలో ఆయన యాప్‌లతో చేసిన ఒప్పందాలు, అందుకున్న పారితోషికం, కమీషన్ వివరాలపై సమగ్రంగా విచారణ జరిగినట్టు సమాచారం.
విజయ్ దేవరకొండ ఈ విచారణకు సహకరించి, అవసరమైన వివరాలు అందించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం ఆయన సీఐడీ కార్యాలయం వెనుక గేటు ద్వారా బయటకు వెళ్లిపోయారు. ఈ విచారణలో ఆయన సమాధానాలు, ఆధారాలు సేకరించి సిట్ అధికారులు తదుపరి చర్యలపై ఆలోచన చేస్తున్నారు.
ఇకపోతే, ఈ వ్యవహారంలో నటుడు ప్రకాశ్ రాజ్‌కు కూడా సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన అనేక కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖులు కూడా విచారణకు హాజరై తమ వివరాలు తెలియజేయాల్సి వస్తోంది.