Sleep: స్ట్రెస్ తగ్గి.. నిద్ర పెరగాలంటే ఈ రూటీన్ ఫాలో అవ్వండి!

2026-01-12 10:10:00
Pending Bills: గత ప్రభుత్వంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులపై.. మంత్రి పయ్యావుల స్పష్టత..!!

నిద్రలేమి (ఇన్సోమ్నియా) (Insomnia) అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సాధారణ అనారోగ్యం సమస్య. సరైన నిద్ర లేకపోతే శరీరానికే కాదు, మనసుకూ అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే కొన్ని చిన్న కానీ ప్రభావవంతమైన అలవాట్లు పాటిస్తే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. దీనివల్ల మన శరీరంలోని బయోలాజికల్ క్లాక్ సరిగ్గా పని చేసి సహజంగా నిద్ర పట్టే అవకాశం పెరుగుతుంది. అలాగే బెడ్రూమ్ వాతావరణం కూడా నాణ్యమైన నిద్రకు కీలకం. గది ఉష్ణోగ్రత 18 నుంచి 22 డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి.

TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!!

ఎక్కువ వేడి లేదా ఎక్కువ చలి రెండూ నిద్రను భంగపరుస్తాయి. గదిలో లైటింగ్ మితంగా ఉండాలి. ఎక్కువ కాంతి మెదడును అప్రమత్తంగా ఉంచి నిద్రను దూరం చేస్తుంది. అందుకే సాఫ్ట్ లైట్ లేదా పూర్తిగా చీకటి వాతావరణం నిద్రకు మంచిది. ఇకపోతే కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ, కోల్డ్ డ్రింక్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్‌ను సాయంత్రం తర్వాత తీసుకోకపోవడం మంచిది. ఇవి నరాలను ఉత్తేజపరిచి నిద్ర రాకుండా చేస్తాయి. శరీరానికి అవసరమైన విటమిన్ D, B12 లాంటి పోషకాలు లోపించకుండా చూసుకోవడం కూడా ముఖ్యం. 

World Politics: ఆ దేశంలో ఇంటర్నెట్ పునరుద్ధరణ కోసం మస్క్‌తో మాట్లాడతా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!

వీటి లోపం అలసట, నిద్ర సమస్యలకు దారితీస్తుంది. అవసరమైతే వైద్యుల సలహాతో సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. మరో ముఖ్యమైన అలవాటు ఏమిటంటే రేపటి పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం. పడుకునే ముందు మనసులో పనుల గురించిన ఆలోచనలు ఎక్కువగా ఉంటే నిద్ర పట్టడం కష్టమవుతుంది. కాబట్టి టు-డూ లిస్ట్ రాసుకుని, మనసుకు ప్రశాంతత కలిగేలా చేసుకోవాలి. 

Security Alert: సరిహద్దులో పాక్ డ్రోన్ల కలకలం! జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్!

అంతేకాదు, పడుకునే ముందు మొబైల్, ల్యాప్‌టాప్ లాంటి స్క్రీన్‌లను ఎక్కువసేపు ఉపయోగించకపోవడం మంచిది. వీటి నుంచి వచ్చే బ్లూ లైట్ మెదడును చురుకుగా ఉంచుతుంది. తేలికపాటి యోగా, ధ్యానం లేదా పుస్తక పఠనం లాంటి అలవాట్లు నిద్రను ఆహ్వానిస్తాయి. మొత్తానికి చిన్న చిన్న మార్పులు చేసి క్రమశిక్షణగా పాటిస్తే నిద్రలేమి సమస్యను సులభంగా జయించవచ్చు. ఆరోగ్యకరమైన నిద్రే ఆరోగ్యకరమైన జీవితానికి మూలమని గుర్తుంచుకోవాలి.

Celebrity Couple: గోల్డెన్ గ్లోబ్ వేదికపై ప్రేమకథకు క్లైమాక్స్.. కైలీ జెన్నర్‌ను ఉద్దేశించి హాలీవుడ్ హీరో సంచలన మాటలు!!!
Science Awards 2025:భారత సంతతి గణిత శాస్త్రవేత్త నళిని జోషికి ఎన్‌ఎస్‌డబ్ల్యూ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు...!
ISRO: నేడు ఇస్రో కీలక రాకెట్ ప్రయోగం..! ఉదయం 10:17కి నింగిలోకి PSLV.. దేశ భద్రతకు మరో కవచం!
Ambhani: భారత అభివృద్ధికి రిలయన్స్ బూస్ట్..! రూ.7 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళిక!
AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..!
Highway: ఏపీ అభివృద్ధికి మరో మైలురాయి..! 6 రోజుల్లో 52 కి.మీ… వరల్డ్ రికార్డ్ రహదారి!
Mobiles : రూ.20 వేల లోపు బెస్ట్ మొబైల్స్ కావాలా.. లిస్ట్ ఇదే!
House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..!
Job News: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెల జీతం రూ.55,932 వరకు..!!

Spotlight

Read More →