High court: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్..! కలెక్టర్లు, ఎస్పీలకు కఠిన ఆదేశాలు... ఆ జిల్లాలపై ప్రత్యేక నిఘా..! Group 2 నియామకాలపై న్యాయ ముసురు తొలగింది…! తుది జాబితా విడుదలకు రంగం సిద్ధం! H-1B వీసాపై ట్రంప్ షాక్! లక్ష డాలర్ల ఫీజుకు కోర్టు గ్రీన్ సిగ్నల్! GHMC Wards: డివిజన్ల పునర్విభజనపై హైకోర్టు క్లారిటీ…! పిటిషన్లు కొట్టివేత! High court: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్..! కలెక్టర్లు, ఎస్పీలకు కఠిన ఆదేశాలు... ఆ జిల్లాలపై ప్రత్యేక నిఘా..! Group 2 నియామకాలపై న్యాయ ముసురు తొలగింది…! తుది జాబితా విడుదలకు రంగం సిద్ధం! H-1B వీసాపై ట్రంప్ షాక్! లక్ష డాలర్ల ఫీజుకు కోర్టు గ్రీన్ సిగ్నల్! GHMC Wards: డివిజన్ల పునర్విభజనపై హైకోర్టు క్లారిటీ…! పిటిషన్లు కొట్టివేత!

GHMC Wards: డివిజన్ల పునర్విభజనపై హైకోర్టు క్లారిటీ…! పిటిషన్లు కొట్టివేత!

2025-12-22 19:40:00
Study Abroad: జర్మనీ లేదా జపాన్‌లో చదవాలనుకుంటున్నారా? మీ భవిష్యత్తుకు ఏ దేశం బెస్ట్ అంటే!!!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన కీలక అంశంపై తెలంగాణ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. జీహెచ్ఎంసీ వార్డుల పునర్వ్యవస్థీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంలో న్యాయస్థానం జోక్యం చేసుకునే పరిధి లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచే ప్రక్రియ చట్టబద్ధంగానే కొనసాగుతుందని హైకోర్టు అభిప్రాయపడింది.

OTT Releases: ఈ వారం ఓటీటీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. సినిమాలు, సిరీస్‌ల వర్షం! లిస్ట్ ఇదిగోండి!

జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా డివిజన్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. డివిజన్ల పునర్విభజనలో పారదర్శకత లేదని, ఎంసీహెచ్‌ఆర్‌డీ (MCRHRD) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన నివేదికను బహిర్గతం చేయలేదని పిటిషనర్లు ఆరోపించారు. అంతేకాదు, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు తగినంత గడువు ఇవ్వలేదని కూడా కోర్టులో వాదనలు వినిపించారు.

Praja Vedika: రేపు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది కీలక వివరాలను హైకోర్టుకు వెల్లడించారు. డీలిమిటేషన్ నోటిఫికేషన్‌ను పూర్తిగా చట్టపరిధిలోనే జారీ చేశామని, దీనికి సంబంధించి అవసరమైన సమాచారం ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ప్రజల నుంచి 3,100కు పైగా అభ్యంతరాలు అందాయని, వాటన్నింటినీ పరిశీలిస్తూ పరిష్కార చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు వివరించారు. ఈ ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

US Immigration: ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ పాలసీలు.. భారతీయులపై తీవ్ర ప్రభావం!

రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని పేర్కొంది. ఈ విధాన అంశాల్లో కోర్టు జోక్యం చేసుకోవడం సముచితం కాదని అభిప్రాయపడింది. అందువల్ల పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పుతో జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్యను 300కు పెంచే ప్రక్రియకు లీగల్ అడ్డంకులు తొలగినట్లయ్యాయి. ఈ నిర్ణయంతో నగర పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

FASTag: ప్రయాణికులకు భారీ ఊరట…! FASTagతో ఇక ప్రతి చెల్లింపూ ఈజీ!
Foxconn Effect: ఐఫోన్ల తయారీ యూనిట్ లో భారీగా నియామకాలు..! 9 నెలల్లో 30 వేల..!
Health tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? సజ్జ రొట్టె.. జొన్న రొట్టీనా? ఏది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసా!
TET: టెట్ అభ్యర్థులకు అలర్ట్…! ప్రాథమిక కీ విడుదల షెడ్యూల్ ఖరారు! ఫలితాల తేదీ ఇదే!
తిరుమలలో ఉన్నత స్థాయి సమీక్ష.. నేడు తేలనున్న కీలక నిర్ణయాలు! 164 గంటల పాటు నిరంతరాయంగా..
సౌదీలో ఆ కార్మికుల‌కు శుభవార్త.. జనవరి 1 నుండి 'ఇ-శాలరీ' తప్పనిసరి! జీతాల చెల్లింపులో కొత్త రూల్స్..

Spotlight

Read More →