LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gulf

USA: హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. యుద్ధం తర్వాత అమెరికా యుద్ధ నౌకల తొలి ప్రయాణం!

USA War Ships: అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు ఈ జలసంధి గుండా సాఫీగా ప్రయాణించినట్లు సమాచారం వెలువడింది.

AndhraPravasi News Desk 2 min read
USA: హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. యుద్ధం తర్వాత అమెరికా యుద్ధ నౌకల తొలి ప్రయాణం!

అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణం.. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు ఈ జలసంధి గుండా సాఫీగా ప్రయాణించినట్లు సమాచారం వెలువడింది.

అమెరికా నౌకాదళానికి చెందిన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు ఎలాంటి అంతరాయం లేకుండా జలసంధిని దాటినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఆపరేషన్‌ను ఇరాన్ అధికారులతో సమన్వయం చేయకుండా చేపట్టినట్లు కూడా పలు వార్తలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని "క్లీర్ చేయడం" ప్రారంభించామని, ఇది చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఒక విధంగా సహాయమేనని అన్నారు. ఈ దేశాలు చేయలేని పనిని అమెరికా చేస్తోందని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌పై కూడా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యుద్ధంలో ఇరాన్ భారీగా నష్టపోతుందని అన్నారు. అయితే హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఏర్పాటు చేసిన సీ మైన్స్ ఇంకా ముప్పుగా ఉన్నాయని వెల్లడించారు. ఏ నౌకైనా ఆ మైన్ లను ఢీకొట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రపంచ ముడి చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ జలసంధి ద్వారానే జరుగుతుండటంతో, ఇక్కడి పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తర్వాత ఇరాన్ ఈ మార్గాన్ని దాదాపు మూసివేసింది. అయితే ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా జలసంధిని తిరిగి తెరవడం ఒక ప్రధాన షరతుగా ఉంది.

ఇక పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరాన్, అమెరికా ఉన్నతాధికారులు పాకిస్తాన్‌లో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈ చర్చలు కీలకంగా మారాయి.

ఇదే సమయంలో ప్రపంచం నలుమూలల నుండి ఖాళీ ఆయిల్ ట్యాంకర్లు అమెరికా వైపు వస్తున్నాయని ట్రంప్ మరో పోస్టులో పేర్కొన్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలు వెల్లడించలేదు.

మొత్తంగా చూస్తే, హర్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులు క్రమంగా మారుతున్నప్పటికీ, ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను ఆతృతగా గమనిస్తున్నాయి.

Be the first to react

More Coverage

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలను…

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: సౌదీ అరేబియాలోని రియాద్ జైలులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామా…