LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Gulf

Gulf Workers Problems: దుబాయ్‌లో జగిత్యాల వాసికి ప్రాణాపాయం..ఆదుకోవాలని సీఎం ప్రవాసీ ప్రజావాణికి భార్య విన్నపం.!!

Telangana NRI Cell Support: దుబాయ్‌లోని ఆస్టర్ ఆస్పత్రిలో జగిత్యాల జిల్లాకు చెందిన కొండ్ర రాజేష్ కోమాలో ఉన్నారు. రూ. 13 లక్షల భారీ ఆస్పత్రి బిల్లు చెల్లించలేక, అతడిని భారత్‌కు రప్పించాలని కుటుంబ సభ్యులు సీఎం ప్రవాసీ ప్రజావాణి ఆశ్రయించారు...

AndhraPravasi News Desk 2 min read
Gulf Workers Problems: దుబాయ్‌లో జగిత్యాల వాసికి ప్రాణాపాయం..ఆదుకోవాలని సీఎం ప్రవాసీ ప్రజావాణికి భార్య విన్నపం.!!

CM Pravasi Prajavani Telangana: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన జగిత్యాల  వాసికి విధి వంచించింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం కోమాలోకి వెళ్లిపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్‌పల్లి గ్రామానికి చెందిన కొండ్ర రాజేష్ అనే వ్యక్తి దుబాయ్‌లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. లక్షలాది రూపాయల ఆస్పత్రి బిల్లు పేరుకుపోవడంతో, తమను ఆదుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అసలేం జరిగింది?

ఉపాధి వెతుక్కుంటూ దుబాయ్‌ వెళ్లిన రాజేష్‌కు ఇటీవల సోరియాసిస్ వ్యాధి తీవ్రమైంది. దీనికి చికిత్స తీసుకునే క్రమంలో ఫిబ్రవరి 27న అక్కడి ‘ఆస్టర్ హాస్పిటల్’లో చేరారు. అయితే దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ ఆయన కోమా లోకి వెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రి ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే బిల్లు సుమారు 53 వేల యూఏఈ దిర్హామ్‌లకు (భారత కరెన్సీలో దాదాపు 13 లక్షల రూపాయలకు పైగా) చేరుకుంది.

నేతల చొరవ.. సాయం కోసం విజ్ఞప్తి

రాజేష్ దయనీయ స్థితిని తెలుసుకున్న ఆయన భార్య అనూష, స్థానిక యువజన నాయకుడు తలారి రాజేష్ సహకారంతో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన జీవన్ రెడ్డి వెంటనే ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి, బాధితుడికి అవసరమైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ఆస్పత్రి బిల్లులు మినహాయింపు చేయించేందుకు, రాజేష్‌ను సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నుంచి చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.

ప్రజావాణిలో దరఖాస్తు.. ముమ్మర ప్రయత్నాలు

రాజేష్ భార్య అనూష శుక్రవారం హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’కి అధికారికంగా దరఖాస్తు పంపారు. తమకు అంత పెద్ద మొత్తం చెల్లించే స్తోమత లేదని, ముఖ్యమంత్రి చొరవ తీసుకుని తన భర్తను క్షేమంగా స్వదేశానికి రప్పించాలని ఆమె వేడుకున్నారు. ప్రజావాణి వాలంటీర్ భార్గవి నద్దునూరి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని, దుబాయ్‌లో ఉన్న రాజేష్ సోదరుడు రమేష్‌తో మరియు అక్కడి సామాజిక కార్యకర్త గుండెల్లి నర్సింలుతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు.

అధికారుల స్పందన కోసం నిరీక్షణ

ప్రభుత్వ ఎన్నారై విభాగం ద్వారా ఈ సమస్యను కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయానికి (మదద్ పోర్టల్ ద్వారా) చేరవేశారు. అలాగే అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF) కూడా రాజేష్ వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి తమ వంతు సాయం అందిస్తోంది. లక్షల రూపాయల ఆస్పత్రి బిల్లును అక్కడి యాజమాన్యం మాఫీ చేస్తుందని, ప్రభుత్వం విమాన ఖర్చులు భరించి రాజేష్‌ను వెనక్కి రప్పిస్తుందని ఆ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది.

Be the first to react

More Coverage

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలను…