Telangana-Gulf Migration: తెలంగాణ - గల్ఫ్ ‘వలస మార్గం’లో సరికొత్త అధ్యాయం: ఇండియా-ఖతార్ కార్మిక సంఘాల సమన్వయం!

Telangana-Gulf Migration: వలస కార్మికుల కోసం పని చేస్తున్న ఈ ఇద్దరు నాయకులు ఒకే జిల్లాకు (జగిత్యాల) చెందిన వారు కావడం విశేషం. వలస వెళ్లే ముందు స్వదేశంలో కార్మికులకు అవగాహన కల్పించడం మరియు వారు ఖతార్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురయ్యే ఇబ్బందులను స్థానిక సంఘాల సాయంతో పరిష్కరించడం అనే అ…

Telangana-Gulf Migration: తెలంగాణ - గల్ఫ్ ‘వలస మార్గం’లో సరికొత్త అధ్యాయం: ఇండియా-ఖతార్ కార్మిక

తెలంగాణ గల్ఫ్ కార్మికులకు అండ…

స్వదేశం - విదేశం మధ్య సమన్వయం…

నిర్మాణ రంగ కార్మికుల హక్కుల రక్షణ….

Telangana-Gulf Migration: గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే భారతీయ కార్మికుల, ముఖ్యంగా తెలుగు వారి కష్టాలను తీర్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఒక కీలక ముందడుగు పడింది. బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (BWI) ఆధ్వర్యంలో, గ్లోబల్ ఆర్గనైజింగ్ అకాడమీ ఆసియా పసిఫిక్ సంస్థ మే 4-5 తేదీల్లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రత్యేక శిక్షణ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఇండియా-ఖతార్ ‘లేబర్ మైగ్రేషన్ కారిడార్’ (వలస మార్గం) పై జరిగిన చర్చలో తెలంగాణ ప్రతినిధులు పోషించిన పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ అంతర్జాతీయ సదస్సులో 10 దేశాల నుండి 22 అనుబంధ సంస్థలకు చెందిన 42 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ నుండి ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మంద భీంరెడ్డి, ఖతార్‌లోని తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షులు మైదం మధు హాజరై, వలస కార్మికుల సమస్యలపై తమ అనుభవాలను పంచుకున్నారు. స్వదేశంలో (తెలంగాణ) మరియు విదేశంలో (ఖతార్) పనిచేసే రెండు వేర్వేరు కార్మిక సంఘాలు సమన్వయంతో పనిచేస్తే, కార్మికులు ఎదుర్కొనే క్లిష్ట సమస్యలను కూడా ఎంత వేగంగా పరిష్కరించవచ్చో వారు సోదాహరణంగా వివరించారు.

Telangana-Gulf Migration: తెలంగాణ - గల్ఫ్ ‘వలస మార్గం’లో సరికొత్త అధ్యాయం: ఇండియా-ఖతార్ కార్మిక

వలస కార్మికుల కోసం పని చేస్తున్న ఈ ఇద్దరు నాయకులు ఒకే జిల్లాకు (జగిత్యాల) చెందిన వారు కావడం విశేషం. వలస వెళ్లే ముందు స్వదేశంలో కార్మికులకు అవగాహన కల్పించడం మరియు వారు ఖతార్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురయ్యే ఇబ్బందులను స్థానిక సంఘాల సాయంతో పరిష్కరించడం అనే అంశంపై ఇరు దేశాల సంఘాల మధ్య బలమైన సమన్వయం ఏర్పడింది. ఈ ‘కారిడార్ సహకారం’ వలస కార్మికుల హక్కుల రక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

ఖతార్‌ వంటి దేశాలకు ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ నుండి వచ్చే నిర్మాణ రంగ వలస కార్మికులకు శిక్షణ, మార్గదర్శనం ఇవ్వడానికి ‘గ్లోబల్ ఆర్గనైజింగ్ అకాడమీ’ నిరంతరం కృషి చేస్తోంది. గమ్యస్థాన దేశాలలోని (Destination Countries) కార్మిక సమూహాలు మరియు మూలస్థాన దేశాలలోని (Origin Countries) BWI అనుబంధ సంస్థల మధ్య సహకారాన్ని పెంచేందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ సమన్వయం వల్ల కార్మికులకు వేతనాల చెల్లింపు, పని ప్రదేశాల్లో భద్రత మరియు ఇతర చట్టపరమైన సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే స్పందించే అవకాశం కలుగుతుంది.

Telangana-Gulf Migration: తెలంగాణ - గల్ఫ్ ‘వలస మార్గం’లో సరికొత్త అధ్యాయం: ఇండియా-ఖతార్ కార్మిక

ఈ నూతన వలస మార్గ సమన్వయం తెలంగాణ నుండి గల్ఫ్ వెళ్ళే వేలాది మంది కార్మికులకు కొండంత అండగా నిలవనుంది. అంతర్జాతీయ సంస్థల తోడ్పాటుతో రూపొందించిన ఈ కార్యాచరణ ద్వారా వలస వెళ్లే వారు మోసాలకు గురికాకుండా, సురక్షితమైన ప్రయాణం మరియు ఉపాధిని పొందే వీలుంటుంది. జగిత్యాల జిల్లా బిడ్డలు అంతర్జాతీయ వేదికపై కార్మికుల పక్షాన నిలవడం తెలంగాణ గర్వించదగ్గ విషయమని వలస కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Be the first to react

Latest