చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా కువైట్‌లో మహా రక్తదాన శిబిరం..
ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులను అభినందించిన టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవం మరియు ఆయన 50 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం సందర్భంగా కువైట్‌లో నిర్వహించిన మహా రక్తదాన శిబిరం సేవా స్పూర్తికి నిదర్శనంగా నిలిచింది. ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం పార్టీ కువైట్ ఆధ్వర్యంలో అదాన్ ఆసుపత్రిలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 500 మందికి పైగా హాజరై రక్తదానం చేయడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు గారు ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవకు అంకితమై పనిచేస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా నడిపిస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన విజనరీ లీడర్ అని పేర్కొన్నారు. అలాంటి నాయకుడి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆయనపై ప్రజల్లో ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనం అని అన్నారు.
విదేశాల్లో ఉన్నప్పటికీ సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తించి ముందుకొచ్చిన ప్రవాసాంధ్రుల సేవా దృక్పథం అభినందనీయమని పల్లా గారు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే సేవ చేయడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. చంద్రబాబు నాయకత్వం కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా, సమాజంలో సేవా భావనను పెంపొందించే దిశగా ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు. “సేవే పరమో ధర్మం” అనే భావనను ఆచరణలో చూపిన నాయకుడిగా ఆయన నిలిచారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్తదాతలకు పార్టీ తరఫున ప్రశంసాపత్రాలు అందజేయడం ద్వారా వారి సేవ, త్యాగానికి గుర్తింపు ఇచ్చినట్లు తెలిపారు. ఈ శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం పార్టీ కువైట్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రవాసాంధ్రులు ఎక్కడ ఉన్నా తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టే విధంగా సేవా కార్యక్రమాల్లో ముందుండడం గర్వకారణమని, చంద్రబాబు గారి స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని పల్లా శ్రీనివాసరావు ఆకాంక్షించారు.
“A Life of Vision and Service: Global Telugu Community Marks Pre-Birthday Celebrations of N. Chandrababu Naidu with Massive Kuwait Blood Drive”
Amaravati, April 18: In the run-up to the 76th birthday of Chief Minister N. Chandrababu Naidu, members of the global Telugu community in Kuwait organised a large-scale blood donation drive, positioning the observance as a tribute rooted in service rather than ceremony. The programme, conducted under the aegis of the NRI Telugu Desam Party (TDP) Kuwait unit at Adan Hospital, witnessed participation from over 500 donors.
TDP State president and Gajuwaka MLA Palla Srinivasa Rao described the initiative as emblematic of a service-oriented culture that has come to be closely associated with Mr. Naidu’s five-decade-long public life. “These pre-birthday observances reflect a conscious shift from symbolic celebration to meaningful societal contribution — a value consistently reinforced through his leadership,” he said.
Highlighting Mr. Naidu’s political journey, Mr. Srinivasa Rao noted that his governance model has balanced development imperatives with welfare priorities, resulting in tangible improvements in public life. “His leadership has extended beyond policy execution to shaping a civic mindset where service is viewed as a collective responsibility,” he observed.
The enthusiastic participation of the Telugu diaspora, he added, underscored their enduring connection with their roots and their commitment to community welfare. “Despite being geographically distant, their willingness to contribute through life-saving acts such as blood donation demonstrates a deeply ingrained sense of responsibility,” he said.
Mr. Srinivasa Rao further emphasised that such initiatives carry heightened significance in addressing medical exigencies, where timely availability of blood can prove critical. “This is not just a tribute; it is a socially consequential act that saves lives and strengthens community bonds,” he remarked.
Certificates of appreciation were presented to the donors in recognition of their contribution. He commended the NRI TDP Kuwait unit for the successful organisation of the programme and expressed confidence that, inspired by Mr. Naidu’s leadership, similar service-driven initiatives would gain wider momentum.
He concluded by noting that the global Telugu community continues to uphold its collective identity through such acts of service, reinforcing the enduring values that define Mr. Naidu’s public life.