LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gulf

Iran Hormuz Strait: హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు.. ప్రపంచ దేశాలకు టోల్ సెగ!

Iran Hormuz Strait: పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది

AndhraPravasi News Desk 2 min read
Iran Hormuz Strait: హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు.. ప్రపంచ దేశాలకు టోల్ సెగ!

ఆర్థిక ఆంక్షలకు ప్రతిగా కొత్త వ్యూహం

భద్రత  పర్యావరణ సాకుతో

అమెరికా  మిత్రదేశాల అభ్యంతరం

Iran Hormuz Strait: పశ్చిమాసియా సెగలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యాన్ని తాకనున్నాయి. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి 'టోల్' వసూలు చేయాలని ఇరాన్ పార్లమెంట్ నిర్ణయించింది. కేవలం ఆర్థిక కోణంలోనే కాకుండా, వ్యూహాత్మక ప్రతీకార చర్యగా ఇరాన్ వేసిన ఈ అడుగు ఇప్పుడు గల్ఫ్ రీజియన్‌లో పెను సంచలనంగా మారింది.

ఇరాన్‌పై అమెరికా  ఇతర పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షలకు చెక్ పెట్టేలా టెహ్రాన్ ఈ సరికొత్త ప్లాన్ సిద్ధం చేసింది. హార్ముజ్ జలసంధి మార్గంలో వెళ్లే ప్రతి నౌక ఇకపై ఇరాన్ అధికారిక కరెన్సీ అయిన 'రియాల్' రూపంలోనే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇరాన్ కరెన్సీకి అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడమే కాకుండా, యుద్ధం వల్ల దెబ్బతిన్న తమ ఆర్థిక వ్యవస్థకు భారీగా ఆదాయం వస్తుందని ఇరాన్ పార్లమెంటరీ భద్రతా కమిటీ భావిస్తోంది.

ఈ కొత్త చట్టం ప్రకారం.. కేవలం డబ్బు వసూలు చేయడమే కాకుండా, ఆ సముద్ర మార్గంలో నౌకల భద్రత, సముద్ర కాలుష్యాన్ని నివారించడం వంటి బాధ్యతలను కూడా ఇరాన్ తన చేతుల్లోకి తీసుకోనుంది. అంటే ఆ మార్గంలో ఏ నౌక వెళ్లాలన్నా ఇరాన్ నిబంధనలకు లోబడి ఉండాల్సిందే. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వంటి శత్రు దేశాల నౌకలను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇది మున్ముందు సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడిచమురులో దాదాపు 20 శాతం ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ఇప్పుడు ఇరాన్ టోల్ వసూలు చేయడం మొదలుపెడితే, చమురు కంపెనీలపై అదనపు భారం పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి కారణం కావచ్చు. ఇప్పటికే యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతిన్న వేళ, ఈ కొత్త 'టోల్' భారం సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తోంది.

ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హార్ముజ్ జలసంధి అనేది అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుందని, అక్కడ టోల్ వసూలు చేసే హక్కు ఏ ఒక్క దేశానికి లేదని వాషింగ్టన్ వాదిస్తోంది. ఈ విషయంలో ఇరాన్‌ను అడ్డుకునేందుకు అమెరికా తన నావికా దళాలను రంగంలోకి దింపే అవకాశం ఉంది. ఫలితంగా గల్ఫ్ సముద్రం మరో యుద్ధ క్షేత్రంగా మారే ప్రమాదం పొంచి  ఉండనుంది.

ఇరాన్ పార్లమెంట్ ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో, అమలు ప్రక్రియ వేగవంతం కానుంది. ఒకవేళ నౌకలు టోల్ కట్టడానికి నిరాకరిస్తే, వాటిని ఇరాన్ సైన్యం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇది గల్ఫ్ దేశాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా, ఐక్యరాజ్యసమితిలో పెద్ద చర్చకు దారితీసేలా ఉంది. మ ఇరాన్ వేసిన ఈ ఎత్తుగడ పశ్చిమాసియా రాజకీయాలను సరికొత్త మలుపు  తిప్పనుంది.

Be the first to react

More Coverage

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలను…

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: సౌదీ అరేబియాలోని రియాద్ జైలులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామా…