IT jobs: డిసెంబర్ డ్రై మంత్‌కు గుడ్‌బై.. జనవరిలో ఐటీ ఉద్యోగ జాతర! Praja Darbar: విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్‌ ప్రజల సమస్యలకు భరోసా!! Lokesh: విజన్ లేకుంటే అభివృద్ధి లేదు..! ఎగతాళి చేసే వాళ్లపై నారా లోకేష్ ఫైర్..! Tata Sierra SUV: రూ.11.49 లక్షల నుంచే ప్రీమియం SUV..! బుకింగ్‌లు ఓపెన్, డెలివరీలు త్వరలో..! World News: బోండి బీచ్‌లో జరిగిన కాల్పులు ఉగ్రవాద దాడేనని స్పష్టం చేసిన ప్రధాని!! Maoist Movement: కుదేలవుతున్న మావోయిస్టు ఉద్యమం..! లీకైన సంచలన వాస్తవాలు! Flash floods: మొరాకోలో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 37 మంది మృతి! Mehreen: త్వరలో పెళ్లి చేసుకుంటున్నానన్న వార్తలు ఫేక్.. మెహ్రీన్ స్పష్టం! BITS: బిట్‌శాట్–2026తో బిట్స్ పిలానీలో అడ్మిషన్లు..! రెండు సెషన్లలో పరీక్ష..! Sajjanar: కన్నవారి పట్ల బాధ్యత చూపాలి.. పిల్లలకు సజ్జనార్ సూచన! IT jobs: డిసెంబర్ డ్రై మంత్‌కు గుడ్‌బై.. జనవరిలో ఐటీ ఉద్యోగ జాతర! Praja Darbar: విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్‌ ప్రజల సమస్యలకు భరోసా!! Lokesh: విజన్ లేకుంటే అభివృద్ధి లేదు..! ఎగతాళి చేసే వాళ్లపై నారా లోకేష్ ఫైర్..! Tata Sierra SUV: రూ.11.49 లక్షల నుంచే ప్రీమియం SUV..! బుకింగ్‌లు ఓపెన్, డెలివరీలు త్వరలో..! World News: బోండి బీచ్‌లో జరిగిన కాల్పులు ఉగ్రవాద దాడేనని స్పష్టం చేసిన ప్రధాని!! Maoist Movement: కుదేలవుతున్న మావోయిస్టు ఉద్యమం..! లీకైన సంచలన వాస్తవాలు! Flash floods: మొరాకోలో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 37 మంది మృతి! Mehreen: త్వరలో పెళ్లి చేసుకుంటున్నానన్న వార్తలు ఫేక్.. మెహ్రీన్ స్పష్టం! BITS: బిట్‌శాట్–2026తో బిట్స్ పిలానీలో అడ్మిషన్లు..! రెండు సెషన్లలో పరీక్ష..! Sajjanar: కన్నవారి పట్ల బాధ్యత చూపాలి.. పిల్లలకు సజ్జనార్ సూచన!

AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి...

2025-12-16 10:29:00
Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ!

ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే పలు ముఖ్య రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ కొత్త షెడ్యూల్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. అనంతపురం మీదుగా నడిచే కలబురిగి–బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్, కొండవీడు ఎక్స్‌ప్రెస్, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల సమయాల్లో ఈ మార్పులు చేశారు. ప్రయాణికులు ఈ తాజా వేళలను గమనించి ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే!

కలబురిగి నుంచి బెంగళూరు వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (22231) ఇప్పటివరకు అనంతపురం స్టేషన్‌కు ఉదయం 9:28 గంటలకు చేరుకునేది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఉదయం 10:04 గంటలకు అనంతపురం చేరుకుని 10:05 గంటలకు బెంగళూరుకు బయలుదేరుతుంది. అలాగే బెంగళూరు నుంచి కలబురిగి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (22232) తిరుగు ప్రయాణంలో ఇకపై సాయంత్రం 5:33 గంటలకు అనంతపురం చేరుకుని 5:35 గంటలకు బయలుదేరనుంది. గతంలో ఈ రైలు 5:58 గంటలకు వచ్చేది.

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 15 గంటల సమయం!

కొండవీడు ఎక్స్‌ప్రెస్ (17212) షెడ్యూల్‌లో కూడా కీలక మార్పులు చేశారు. ఈ రైలు గతంలో అనంతపురానికి ఉదయం 6:38 గంటలకు చేరుకునేది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఉదయం 4:33 గంటలకు చేరుకుని 4:35 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా, ఇప్పటివరకు పుట్టపర్తి స్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు నిలిచే ఈ రైలు, ఇకపై పుట్టపర్తిలో ఆగదని అధికారులు తెలిపారు.

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌... వడ్డీ రేట్ల పై కీలక నిర్ణయం!

బెంగళూరు సిటీ నుంచి భువనేశ్వర్ వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) టైమింగ్ కూడా మార్చారు. ఈ రైలు గతంలో అనంతపురం స్టేషన్‌కు సాయంత్రం 6:13 గంటలకు వచ్చి 6:15 గంటలకు వెళ్లేది. తాజా షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:28 గంటలకు చేరుకుని 6:30 గంటలకు బయలుదేరుతుంది. ఈ మూడు రైళ్లకు సంబంధించిన మారిన వేళలు అన్నీ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి.

Constable Recruitment: మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు! సీఎం చంద్రబాబు హాజరు!

ఇదే సమయంలో శబరిమల యాత్రికుల సౌకర్యార్థం అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లను కూడా నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి నుంచి కొల్లామ్‌కు వెళ్లే ప్రత్యేక రైలు (07127) జనవరి 10, 17 తేదీల్లో నడుస్తుంది. ఇది అనంతపురానికి రాత్రి 7:53 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రత్యేక రైలు (07128) జనవరి 12, 19 తేదీల్లో అనంతపురానికి తెల్లవారుజామున 2:33 గంటలకు చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ముందుగానే ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

YONO 2.0: UPI చెల్లింపులు మరింత ఈజీ! SBI నుండి యోనో 2.0 లాంచ్...
Biometric: ఏపీ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్..! స్కూల్స్‌లోనే ఉచితంగా.. లాస్ట్ డేట్ త్వరలోనే..!
PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే..
Natural Remedies: రోజూ ఇవి తింటే షుగర్, బీపీ... జీర్ణ సమస్యలకు గుడ్‌బై!
AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్… భూ సమస్యల పరిష్కారానికి కొత్త విధానం!

Spotlight

Read More →