LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gadgets

Vivo V70 FE 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం.. ఆకట్టుకునే ధరలో ప్రీమియం ఫీచర్లతో వి70 FE లాంచ్.!

Vivo V70 FE 5G: గత నెల రోజులుగా టెక్ ప్రియులను ఊరిస్తున్న వివో (Vivo), తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ వివో వి70 FE (Vivo V70 FE) ను ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన ధరతో పాటు 200MP భారీ కెమెరా వంటి వినూత్న ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్…

AndhraPravasi News Desk 2 min read
Vivo V70 FE 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం.. ఆకట్టుకునే ధరలో ప్రీమియం ఫీచర్లతో వి70 FE లాంచ్.!
  • "డీటెయిల్స్ అదిరిపోయాయి": 200MP అల్ట్రా స్టెబిలైజేషన్ కెమెరాతో వివో కొత్త ఫోన్ అరంగేట్రం..
     
  • Gadgets: "ఛార్జింగ్ టెన్షన్ ఇక లేదు": స్లీక్ డిజైన్‌లోనూ 7000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్..

Vivo V70 FE 5G: గత నెల రోజులుగా టెక్ ప్రియులను ఊరిస్తున్న వివో (Vivo), తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ వివో వి70 FE (Vivo V70 FE) ను ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన ధరతో పాటు 200MP భారీ కెమెరా వంటి వినూత్న ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు మరియు లభ్యతకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి..

ధర మరియు వేరియంట్లు..
ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కావడానికి ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయిన ధరలనే కంపెనీ ఖరారు చేసింది. వివో వి70 FE మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999 కాగా, 8 జీబీ + 256 జీబీ మోడల్ ధర రూ. 40,999 గా ఉంది. ఇక హై-ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ + 128 జీబీ మోడల్‌ను రూ. 44,999 ధరకు వివో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ 'మాన్సూన్ బ్లూ' మరియు 'నాథర్న్స్ లైట్ పర్పల్' అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

లాంచ్ ఆఫర్లు మరియు సేల్ వివరాలు..
వివో వి70 FE కోసం ప్రీ-ఆర్డర్లు ఈరోజు నుంచే ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ ఫోన్ అధికారిక విక్రయాలు మొదలవుతాయి. లాంచ్ ఆఫర్ల విషయానికొస్తే, Axis మరియు కోటక్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి తోడు 10% ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది. అదనపు ప్రయోజనంగా ఒక సంవత్సరం వారంటీ మరియు iQOO TWS 1e ఇయర్ బడ్స్‌ను అతి తక్కువ ధరకే పొందే అవకాశాన్ని కంపెనీ కల్పించింది.

డిస్‌ప్లే మరియు పర్ఫార్మెన్స్..
ఈ స్మార్ట్‌ఫోన్ 6.83 ఇంచ్ బిగ్ OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, ఇందులో మీడియాటెక్ Dimensity 7360 Turbo చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది 12 జీబీ వరకు ర్యామ్ మరియు 256 జీబీ అంతర్గత స్టోరేజ్‌ను సపోర్ట్ చేస్తుంది. కొత్త 'డార్క్ నెస్ గ్లో' టెక్నాలజీతో కూడిన స్లీక్ డిజైన్ ఈ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

కెమెరా మరియు బ్యాటరీ సామర్థ్యం..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 200MP మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ సెటప్‌ను అందించారు. ఇది అల్ట్రా స్టెబిలైజేషన్, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ, 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ AI ఫీచర్లను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇంత స్లీక్ డిజైన్‌లోనూ వివో 7000 mAh భారీ బ్యాటరీని పొందుపరచడం విశేషం. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

Be the first to react

More Coverage

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఆపిల్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ కొనుగోలు…

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: యాపిల్ మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్‌కు గట్టి పోటీ ఇస్తూ డెల్ సంస్థ తన ప్రీమియం ‘ఎక్స్‌ప…