Galaxy ZFold 8: బిగ్ స్క్రీన్.. బిగ్గర్ బ్యాటరీ... 'గెలాక్సీ Z ఫోల్డ్ వైడ్' మోడల్‌తో సరికొత్త ఎంట్రీ! Realme Buds: రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5.! Motorola: భారత్‌లో సరికొత్త 'రేజర్ ఫోల్డ్' మొబైల్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా! Android17: ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు గూగుల్ చెక్... జెమిని ఏఐతో ఆండ్రాయిడ్ 17 బీటా విడుదల! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్! Vivo T5 Pro: రోజంతా వచ్చే భారీ బ్యాటరీ... స్లిమ్ డిజైన్! ధర మరియు ఫీచర్ల పూర్తి వివరాలు! One Plus Phone: డబ్బున్నా కొనలేని ఫోన్.. వన్ ప్లస్ 'ఇన్వైట్ సిస్టం' సృష్టించిన మార్కెటింగ్ సంచలనం! Galaxy ZFold 8: బిగ్ స్క్రీన్.. బిగ్గర్ బ్యాటరీ... 'గెలాక్సీ Z ఫోల్డ్ వైడ్' మోడల్‌తో సరికొత్త ఎంట్రీ! Realme Buds: రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5.! Motorola: భారత్‌లో సరికొత్త 'రేజర్ ఫోల్డ్' మొబైల్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా! Android17: ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు గూగుల్ చెక్... జెమిని ఏఐతో ఆండ్రాయిడ్ 17 బీటా విడుదల! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్! Vivo T5 Pro: రోజంతా వచ్చే భారీ బ్యాటరీ... స్లిమ్ డిజైన్! ధర మరియు ఫీచర్ల పూర్తి వివరాలు! One Plus Phone: డబ్బున్నా కొనలేని ఫోన్.. వన్ ప్లస్ 'ఇన్వైట్ సిస్టం' సృష్టించిన మార్కెటింగ్ సంచలనం!

Realme P4 Lite 5G: బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ 5G ఫోన్.. ఆఫర్ల వివరాలు ఇవే!

Realme P4 Lite 5G: P4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌లో అమ్మకానికి సిద్ధమైంది. 7000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర, ఆఫర్లు స్పెసిఫికేషన్లు తెలుసుకోండి...

Published : 2026-03-25 14:08:00

Gadgets : బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి రియల్మీ తీపి కబురు అందించింది. గత వారం భారత మార్కెట్లో విడుదలైన 'రియల్మీ P4 లైట్ 5G' స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఈరోజు (మార్చి 25) మధ్యాహ్నం నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్, ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా ఉంది. ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తోంది. 4GB రామ్ + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ. 12,999 కాగా, 4GB + 128GB మోడల్ రూ. 13,999  టాప్ ఎండ్ 6GB + 128GB వేరియంట్ ధర రూ. 15,999గా నిర్ణయించారు. అయితే, లాంచ్ ఆఫర్ కింద కంపెనీ రూ. 1,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై మరో రూ. 500 అదనపు తగ్గింపును ఇస్తోంది. దీంతో ప్రారంభ ధర రూ. 11,499కే వినియోగదారులకు లభించనుంది. పాత ఫోన్ మార్చుకునే వారికి ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల భారీ HD+ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం విశేషం, దీనివల్ల గేమింగ్ ఆడేటప్పుడు లేదా వీడియోలు చూసేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. మొజాయిక్ బ్లూ, మొజాయిక్ గ్రీన్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది. ఫోన్ పట్టుకోవడానికి వీలుగా, స్లిమ్‌గా డిజైన్ చేశారు.

సామర్థ్యం విషయానికి వస్తే, ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్‌ను వాడారు. ఇది మల్టీ టాస్కింగ్  5G ఇంటర్నెట్ వాడకానికి చక్కగా సరిపోతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్మీ UI 7.0 సాఫ్ట్‌వేర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఫోన్ వేడిక్కకుండా ఉండటానికి ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఫోటోల కోసం వెనుక వైపు 13 మెగాపిక్సెల్ AI కెమెరా, సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీనిలోని 7,000mAh భారీ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 70 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దుమ్ము మరియు నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్‌ను ఇచ్చారు. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ మరియు 5G కనెక్టివిటీ కోరుకునే వారికి ఈ రియల్మీ P4 లైట్ 5G ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Spotlight

Read More →