Best Smartphones 2026: పోకో, ఐకూ, వివో.. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు ఏ ఫోన్ బెస్ట్? Best Product: వంట గదికి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్! 33 స్టైల్స్ తో... Vivo T5x 5G: వివో నుంచి పవర్ ఫుల్ ఫోన్... 7200mAh బ్యాటరీతో Vivo T5x 5G విడుదల! Poco X8 Pro Max: పోకో సంచలనం... 9,000mAh భారీ బ్యాటరీతో Poco X8 Pro Max లాంచ్! 4G Keypad Phones: బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు... 2026 బెస్ట్ 4G కీప్యాడ్ ఫోన్లు ఇవే! Motorola: మోటోరోలా నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్ డేట్ ఫిక్స్! Best Smartphones 2026: పోకో, ఐకూ, వివో.. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు ఏ ఫోన్ బెస్ట్? Best Product: వంట గదికి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్! 33 స్టైల్స్ తో... Vivo T5x 5G: వివో నుంచి పవర్ ఫుల్ ఫోన్... 7200mAh బ్యాటరీతో Vivo T5x 5G విడుదల! Poco X8 Pro Max: పోకో సంచలనం... 9,000mAh భారీ బ్యాటరీతో Poco X8 Pro Max లాంచ్! 4G Keypad Phones: బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు... 2026 బెస్ట్ 4G కీప్యాడ్ ఫోన్లు ఇవే! Motorola: మోటోరోలా నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్ డేట్ ఫిక్స్!

Best Smartphones 2026: పోకో, ఐకూ, వివో.. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు ఏ ఫోన్ బెస్ట్?

Best Smartphones 2026: పోకో X8 ప్రో మాక్స్, ఐకూ 15R వివో V70 ఎలైట్ స్మార్ట్‌ఫోన్ల మధ్య ఏది మెరుగైనది? 9,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ జీస్ కెమెరా ఫీచర్లతో ఉన్న మూడు ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధర, కెమెరా, పర్ఫార్మెన్స్ వివరాలు..

Published : 2026-03-21 17:20:00

Best Smartphones 2026: ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌లో పోటీ మామూలుగా లేదు. ముఖ్యంగా మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో ఒకదానికొకటి పోటీగా కొత్త ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇటీవల పోకో తన పవర్‌ఫుల్ మోడల్ 'పోకో X8 ప్రో మాక్స్' (Poco X8 Pro Max) ను మార్కెట్లోకి తెచ్చింది. దీనికి గట్టి పోటీగా ఇప్పటికే ఐకూ 15R (iQOO 15R), వివో V70 ఎలైట్ (Vivo V70 Elite) అందుబాటులో ఉన్నాయి. ఈ మూడింటిలో ఏది కొంటే మంచిది  అన్నది ఇప్పుడు క్లియర్ గా చూద్దాం.

భారీ బ్యాటరీ కావాలా? అయితే పోకోనే!

మొబైల్ వాడకం ఎక్కువ ఉన్నవారికి బ్యాటరీ పెద్ద సమస్య. ఈ విషయంలో పోకో X8 ప్రో మాక్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో ఏకంగా 9,000mAh బ్యాటరీ ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు వస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇక దీని ధర రూ. 42,999 నుంచి మొదలవుతుంది. ధరకు తగ్గట్టుగానే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్ వాడారు. ఎక్కువగా ట్రావెల్ చేసేవారికి, రోజంతా ఫోన్ వాడేవారికి ఇది సూపర్ ఆప్షన్.

గేమర్స్ కోసం ఐకూ 15R

మొబైల్ లో గేమ్స్ ఆడేవారికి ఐకూ ఎప్పుడూ ఫేవరెట్. ఐకూ 15R మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5) ప్రొసెసర్‌తో వస్తోంది. ఇది చాలా పవర్‌ఫుల్ చిప్‌సెట్. దీని డిస్ప్లే గేమింగ్ సమయంలో 144Hz వరకు స్పీడ్ ఇస్తుంది, అంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్కడా లాగ్ (Lag) అవ్వదు. ఇందులో 7,600mAh బ్యాటరీ ఉంది. దీని స్టార్టింగ్ ధర రూ. 44,999. మంచి పర్ఫార్మెన్స్, స్పీడ్ కావాలనుకునే యువతకు ఇది కరెక్ట్ గా సరిపోతుంది.

ఫోటోగ్రఫీ అంటే వివో వెనకే..

మీకు ఫోటోలు తీయడం, వీడియోలు చేయడం అంటే ఇష్టం అయితే వివో V70 ఎలైట్ వైపు చూడొచ్చు. వివో అంటేనే కెమెరాకు పెట్టింది పేరు. ఇందులో జీస్ (Zeiss) టెక్నాలజీతో కూడిన మూడు కెమెరాలు వెనుక వైపు ఉన్నాయి. మెయిన్ కెమెరాతో పాటు టెలిఫోటో లెన్స్ కూడా ఇవ్వడం వల్ల దూరంగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా ఫోటో తీయొచ్చు. సెల్ఫీ కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం. అయితే దీని ధర కొంచెం ఎక్కువే, రూ. 51,999 నుంచి ప్రారంభం అవుతుంది.

ఏది కొంటే లాభం?

ఈ మూడు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తోనే పనిచేస్తాయి. మీకు కేవలం బ్యాటరీ లైఫ్  రఫ్ యూసేజ్ ముఖ్యం అనుకుంటే పోకో బెస్ట్. గేమింగ్ కోసం అయితే ఐకూ 15R తీసుకోవచ్చు. ఇక లుక్స్, స్లిమ్ డిజైన్  అదిరిపోయే కెమెరా కావాలంటే కొంచెం ఎక్కువ ఖర్చయినా వివో వైపు వెళ్లడం మంచిది. మీ బడ్జెట్ మరియు మీ అవసరాన్ని బట్టి మీరు సరైన నిర్ణయం తీసుకోండి.

Spotlight

Read More →