Galaxy ZFold 8: బిగ్ స్క్రీన్.. బిగ్గర్ బ్యాటరీ... 'గెలాక్సీ Z ఫోల్డ్ వైడ్' మోడల్‌తో సరికొత్త ఎంట్రీ! Realme Buds: రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5.! Motorola: భారత్‌లో సరికొత్త 'రేజర్ ఫోల్డ్' మొబైల్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా! Android17: ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు గూగుల్ చెక్... జెమిని ఏఐతో ఆండ్రాయిడ్ 17 బీటా విడుదల! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్! Vivo T5 Pro: రోజంతా వచ్చే భారీ బ్యాటరీ... స్లిమ్ డిజైన్! ధర మరియు ఫీచర్ల పూర్తి వివరాలు! One Plus Phone: డబ్బున్నా కొనలేని ఫోన్.. వన్ ప్లస్ 'ఇన్వైట్ సిస్టం' సృష్టించిన మార్కెటింగ్ సంచలనం! Galaxy ZFold 8: బిగ్ స్క్రీన్.. బిగ్గర్ బ్యాటరీ... 'గెలాక్సీ Z ఫోల్డ్ వైడ్' మోడల్‌తో సరికొత్త ఎంట్రీ! Realme Buds: రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5.! Motorola: భారత్‌లో సరికొత్త 'రేజర్ ఫోల్డ్' మొబైల్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా! Android17: ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు గూగుల్ చెక్... జెమిని ఏఐతో ఆండ్రాయిడ్ 17 బీటా విడుదల! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్! Vivo T5 Pro: రోజంతా వచ్చే భారీ బ్యాటరీ... స్లిమ్ డిజైన్! ధర మరియు ఫీచర్ల పూర్తి వివరాలు! One Plus Phone: డబ్బున్నా కొనలేని ఫోన్.. వన్ ప్లస్ 'ఇన్వైట్ సిస్టం' సృష్టించిన మార్కెటింగ్ సంచలనం!

Oppo K14 5G: తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలా? ఒప్పో K14 5G పై ఓ లుక్కేయండి!

Oppo K14 5G Sale: ఒప్పో K14 5G స్మార్ట్‌ఫోన్ 7,000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా శక్తివంతమైన డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ ధర, బ్యాంక్ ఆఫర్లు పూర్తి ఫీచర్లు

Published : 2026-03-20 14:43:00

భారీ బ్యాటరీ.. ఇక ఛార్జింగ్ టెన్షన్ లేదు

కెమెరా  డిస్‌ప్లే అదిరిపోయింది

పెర్ఫార్మెన్స్  స్టోరేజ్ వివరాలు

Oppo K14 5G Sale: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి సరికొత్త మోడల్ K14 5G నేటి నుంచి భారత మార్కెట్లో అమ్మకానికి సిద్ధమైంది. కేవలం ధర మాత్రమే కాకుండా, ఈ ఫోన్‌లో ఇచ్చే ఫీచర్లు సామాన్య వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ సేపు ఫోన్ వాడే వారికి, ఫొటోలు తీసుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ ధర, ఫీచర్లు  ఆఫర్ల  ఇప్పుడు చూద్దాం.

ఈ ఫోన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం దాని 7,000mAh బ్యాటరీ. సాధారణంగా ఫోన్లలో 5,000mAh బ్యాటరీ ఉంటుంది, కానీ ఒప్పో ఇందులో అంతకంటే పెద్ద బ్యాటరీని ఇచ్చింది. దీనివల్ల ఒక్కసారి ఛార్జింగ్ పెడితే రెండు రోజుల పాటు నిశ్చింతగా వాడుకోవచ్చు. దీనికి తోడు 45W సూపర్ వూక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది, కాబట్టి బ్యాటరీ పెద్దదైనా త్వరగానే ఛార్జ్ అవుతుంది.

ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. దీనివల్ల తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన ఫొటోలు తీసుకోవచ్చు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక స్క్రీన్ విషయానికి వస్తే, 6.75 అంగుళాల పెద్ద ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. దీనివల్ల వీడియోలు చూసినా లేదా గేమింగ్ ఆడినా ఫోన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 5G నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంటర్నెట్ స్పీడ్ బాగుంటుంది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ ధర రూ. 17,999 గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ (8GB+256GB) ధర రూ. 21,999 వరకు ఉంటుంది. ఐసీ బ్లూ, ప్రిజం వైలెట్  వైట్ రంగుల్లో ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్  లేదా ఒప్పో అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం లాంచ్ ఆఫర్ కింద HDFC, ICICI లేదా SBI కార్డులు వాడే వారికి రూ. 1,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు మూడు నెలల వరకు ఎటువంటి వడ్డీ లేని EMI  కూడా అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వారికి ఈ ఒప్పో K14 5G ఒక మంచి మొబైల్.

Spotlight

Read More →